రంగారెడ్డి

గడువులోపు ‘్భగీరథ’ పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, అక్టోబర్ 17: జిల్లాలో చేపడుతున్న మిషన్ భగీరథ పనులను గడువులోగా పూర్తి చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను కలెక్టర్ దివ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మిషన్ భగీరథ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దృష్ట్యా పనులను వేగవంతం చేసి అనుకున్న సమయానికి జిల్లాలో తాగునీటిని ప్రజలకు అందించాలని సూచించారు. ఒహెచ్‌ఆర్ పనులను ఎప్పటికపుడు డిఇలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పురోగతిపై నివేదికలు అందజేయాలని పేర్కొన్నారు. పైపులైన్ పనులు చేసే సమయాల్లో సమస్యలెదురైతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. పైపులైన్లు వేసే క్రమంలో ఆర్‌అండ్‌బి, అటవీశాఖలతో సమస్యలుత్పన్నమైతే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పైపులైన్లు, ఒహెచ్‌ఆర్ పనులను నెలవారీగా విభజించి పనులు చేపట్టాలని వివరించారు. పనులపై ప్రతి శుక్రవారం సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. సమీక్షలో ఆర్‌డబ్ల్యుఎస్ ఇన్‌చార్జి ఆంజనేయులు, డిఇలు శ్రీనివాస్, వెంకటరామ్ నాయక్, జైపాల్‌రెడ్డి, వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
రైతులకు దారి కోసం స్థల పరిశీలన
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం పొలాలకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారని, రైల్వే ట్రాక్ ఉన్నందున ఇక్కట్ల పాలవుతున్నామని కచ్చా రహదారిని ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో కలెక్టర్‌ను రైతులు కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం పంచాయతిరాజ్ ఇఇ మనోహర్ రావు, ఎఇ లక్ష్మయ్యతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని, రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. పరిశీలనకు వచ్చిన అధికారులను కలిసిన రైతుల్లో మాచన్‌పల్లి యాదయ్య, అశోక్, శంకర్, నాసన్‌పల్లి రాములు ఉన్నారు.
20న ఉపాధి హామీ
సామాజిక తనిఖీ ప్రజావేదిక
జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం సామాజిక తనిఖి ప్రజావేదిక ఈనెల 20వ తేది ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని స్ర్తిశక్తి భవనంలో నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి ఎం.సత్తయ్య తెలిపారు.