రంగారెడ్డి

సైబర్ భద్రతకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 17: మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసిలో 23న సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ 3.0 సదస్సు నిర్వహిస్తున్నటు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా తెలిపారు. సదస్సును సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సిపి చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశం వేగంగా పురోగామిస్తోందని, ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉందన్నారు. దేశంలో ఇ-బిజినెస్ రోజురోజుకీ విస్తరిస్తుందని, అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రోజన్లు, రాన్‌సమ్‌వేర్లు, మాల్వేర్లు, బగ్స్ సాఫ్ట్‌వేర్ సంస్థలకు పెను ముప్పుగా మారి సవాల్ విసురుతున్నాయని చెప్పారు. సాఫ్ట్‌వేర్ సంస్థలు.. సైబర్ భద్రతకు సంబంధించి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సైబర్ నేరాల నిరోధానికి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. సైబర్ నేరాలను ఛేదించడానికి సైబరాబాద్ పోలీసులకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారని పేర్కొన్నారు. జాయింట్ సిపి షానావాజ్ ఖాసీం మాట్లాడుతూ అంతర్జాలంలో డార్క్‌నెట్‌లో డ్రగ్స్, వెపన్స్ ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఐటి సంస్థలు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ భరణి ఆరోల్ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ సమావేశాలను 2015 నుంచి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 23న జరగనున్న సైబర్ కాన్‌క్లేవ్ 3.0 సమావేశం దక్షణ భారతదేశంలోనే పెద్దదని చెప్పారు. సైబర్ దాడులను ఎదుర్కోవడంతోపాటు దాడి జరిగిన సంస్థలు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో సదస్సులో వివరిస్తారని తెలిపారు. నిష్ణాతులైన నిపుణులు సైబర్ ఎటాక్స్‌పై ప్రదర్శనలు ఇస్తారని చెప్పారు. సమావేశానికి ఐటి శాఖ మంత్రి కెటిఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, హోంశాఖ సమాచార కార్యదర్శి రుద్రమూర్తి, ట్రాఫిక్ అండ్ రైల్వే డిజిపి కృష్ణప్రసాద్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటి సంస్థల చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, ప్రభుత్వ రంగాల సంస్థల ప్రతినిధులు, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థలు, హెల్త్‌కేర్, రవాణా రంగాలకు చెందిన ప్రతినిధులతో పాటు యూకె, యూఎస్, ఇజ్రాయిల్, మిడిల్ ఈస్ట్ దేశాలకు చేందిన 350మంది డెలిగేట్స్, 30మంది స్పీకర్లుతో పాటు తెలంగాణ పోలీసు అధికారులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు శ్రీకాంత్ శ్రీనివాసన్, రాజేంద్ర ప్రసాద్, మోహన్ పాల్గొన్నారు.
రాయితీపై శనగ విత్తనాలు
మేడ్చల్, అక్టోబర్ 17: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ శనగ విత్తనాలను 70 శాతం రాయితీపై అందుబాటులో ఉంచిందని.. పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అసక్తి గల రైతులు తీసుకోవచ్చని మండల వ్యవసాయాధికారి శైలజ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 25 కిలోల శనగ విత్తనాల పూర్తి ధర రూ. 2170 కాగా రాయితీపై రూ. 970లకే రైతులకు ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. రూ. 1200లకు జెజి - 11 అనే శనగ రకం విత్తనాలు ఎండుతెగులును తట్టుకొని లావుపాటి గింజలు దేశీయ రకం అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పంట కాలం 100 నుండి 105 రోజులు నల్లరేగడి భూములు శనగ పంటకు అనుకూలమని తెలిపారు.

విద్యార్థిని ప్రజ్వల ఎక్కడ..?
అదృశ్యంపై వీడని మిస్టరీ* గాలింపు చర్యలు ముమ్మరం

ఉప్పల్, అక్టోబర్ 17: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని సాయిప్రజ్వల అదృశ్యం మిస్టరీగా మారింది. ఆమె జాడ కోసం రంగంలోకి దిగిన నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు జెబిసి, ఎంజిఎం బస్‌స్టేషన్లలో అమర్చిన సిసి కెమెరాల ద్వారా తనిఖీలను చేపట్టారు. నారాయణ కళాళాల యాజమాన్యం ఒత్తిడి వల్ల హాస్టల్‌లో ఉండలేక పోతున్నానని స్వయంగా లేఖ రాసి బయటకు వెళ్లిన ప్రజ్వల.. కన్పించకుండా పోయి వారం రోజులు గడుస్తుండటంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కుమార్తె ఎక్కడ వెళ్లిందోనని స్నేహితులు, బంధువుల ఇళ్లలో గాలిస్తున్నా ప్రయోజనం లేకపోయింది. కాగా, తిరుపతిలో ఉన్నట్లు వస్తున్న వదంతులు నమ్మవద్దని పోలీసులు హితవు పలుకుతున్నారు.