రంగారెడ్డి

ఐదుగురి ఆత్మ‘హత్య’తో అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో దారుణం
పటన్‌చెరు, నార్సింగి, అక్టోబర్17: నగర శివారులో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనతో పటన్‌చెరు అమీన్‌పూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూల్ డ్రింక్స్‌లో గుర్తుతెలియని విషం కలుపుకుని తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. చెట్ల పొదల్లో ముగ్గురి మృతదేహాలు, రెండు కిలోమీటర్ల దూరంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో ఇది ఆత్మహత్యనా? లేదా..ఎవరైనా విషం ఇచ్చి హత్య చేశారా? అనే మీమాంస వ్యక్తమవుతోంది. నార్సింగ్ పరిధిలోని కొల్లూరు ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో మంగళవారం వెలుగుచూసిన సంఘటన కలకలం కలిగింది. అమీన్‌పూర్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి స్టాక్ మార్కెట్ వ్యాపారం చేస్తూ, రాంచంద్రాపూర్ అశోక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. రవీందర్‌రెడ్డి ఐఐటిడబ్ల్యు సిగ్నోర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా వీరిద్దరు సమీప బంధువులు ఇటీవల వ్యాపారంలో నాలుగు కోట్ల మేరకు నష్టం రావడంతో ఇటీవల ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డికి రూ. 90 లక్షలు ఇచ్చినట్టు తెలిసింది. కాగా సోమవారం రవీందర్‌రెడ్డి భార్య లక్ష్మి కుమార్తె సింధూజ ప్రభాకర్‌రెడ్డిఆయన భార్య మాధవి కొడుకు వశిష్ సోమవారం శ్రీశైలం వెళ్తున్నామని చెప్పి ఇంట్లోంచి ఓ కారులో వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి గం. 9:00లకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టగా మంగళవారం ఉదయం కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఐదుగురి మృతదేహాలను కనుగొన్నారు. మృతుల కుటుంబీకులకు సమాచారమిచ్చారు. * వివరాలు మెయన్‌లో..

చైన్‌స్నాచర్ల హల్‌చల్
పట్టపగలు మహిళపై దాడి

ఉప్పల్, అక్టోబర్ 17: చైన్‌స్నాచర్లు విభృంభిస్తున్నారు. వారం రోజుల క్రితమే చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులు మళ్లీ ఇదే కాలనీలో పట్టపగలు మహిళపై దాడి చేసి ఆమె మెడలోని పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. ఈ సంఘటన మంగళవారం ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ విజయపురి కాలనీలో నివసిస్తున్న వెలిమినేడి అరుణ (35) మంగళవారం ఉదయం ఇంటి నుంచి కిరాణ స్టోర్‌కు వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కొని పారిపోయారు. వారిని వెంబడించినా ఫలితం లేకపోయిందని వాపోతూ న్యాయం కోసం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కొమురయ్య తెలిపారు. వారం రోజుల క్రితం ఈ ప్రాంతంలోనే చైన్ స్నాచింగ్ జరిగిన విషయం తెలిసిందే. వరుసగా ఇదే కాలనీలో జరిగిన సంఘటనలతో కాలనీల మహిళలు రోడ్డున ఒంటరిగా వెళ్లేందుకు భయపడున్నారు.