రంగారెడ్డి

క్యాబ్ డ్రైవర్ వికృత చేష్టలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 21: ఓ క్యాబ్ డ్రైవర్ వికృత చేష్టలకు తెగబడ్డాడు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించిన సంఘటన ఔటర్ రింగ్‌రోడ్డుపై చోటుచేసుకుంది. శనివారం వెలుగుచూసిన సంఘటన వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఒబేర్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా, క్యాబ్ డ్రైవర్,ఓనర్ దాడి ప్రేమ్‌కుమార్ (26) ప్రయాణికురాలిని క్యాబ్ అద్దం నుంచి తరచూ చూస్తూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఇది గ్రహించిన సదరు మహిళ క్యాబ్ డ్రైవర్‌ను తీవ్రంగా హెచ్చరించింది. అయినప్పటికీ క్యాబ్ డ్రైవర్ తన వెకిలి చేష్టలు మానలేదు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో డ్రైవర్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు ఆమెను విమానాశ్రయం వద్ద దింపేశాడు. సమయాభావం వల్ల ప్రయాణికురాలు ఢిల్లీ వెళ్లిపోయింది. ఢిల్లీలో విమానం ల్యాండ్ అవ్వగానే సఫ్దర్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే ఫిర్యాదును ఫేస్‌బుక్ ద్వారా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యకు పోస్టు చేసింది.
కమిషనర్ ఆదేశానుసారం మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్ క్యాబ్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి క్యాబ్ డైవర్,ఓనర్ ప్రేమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా మహిళ ఫిర్యాదును స్పందించి నిందితుడిని గుర్తించిన డిసిపి విశ్వప్రసాద్‌ను పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య అభినందించారు.