రంగారెడ్డి

మహిళను బెదిరించి బంగారం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 21: మేడ్చల్ పట్టణంలోని సరస్వతీ నగర్ కాలనీలో శనివారం తెల్లవారు ఝామున ఇద్దరు దొంగలు ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో ఉన్న మహిళలను కర్రలతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ గ్యార పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సరస్వతీ నగర్‌కాలనీలో నివాసం ఉండే నిరంజన్‌రెడ్డి అనే వ్యక్తి తన భార్య పరిశోధన(24), ఆమె సోదరి సుకన్యలతో కలిసి నివాసం ఉంటున్నాడు. నిరంజన్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నాడు. దీంతో వారంలో మూడు రోజులు మేడ్చల్‌లో మిగతా రోజులు బంకు వద్ద ఉంటున్నాడు. పరిశోధన సిద్ధిపేట్ జిల్లా ములుగు మండల కొల్తూరు గ్రామంలో ప్రయివేటు ఉపాధ్యాయినిగా పనిచేస్తుంది. శనివారం తెల్లవారు ఝామున 3 గంటల ప్రాంతంలో ఇద్దరు దొంగలు పరిశోధన ఇంటికి వెళ్లి కిటికీలో టవర్‌బోల్టు తొలగించి తలుపులు పగులగొట్టి ఇంటిలోనికి చొరబడ్డారు. వారి చేతిలో ఉన్న వెదురు కర్రతో పరిశోధన కుడి చేయిపై దాడి చేసి బెదిరించడంతో ఆమె మెడలో ఉన్న 4తులాల బంగారు మంగళసూత్రం, ఒక తులం బంగారు గొలుసు తీసుకుని అక్కడి నుండి ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌టీంతో, జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గ్యార పవన్‌కుమార్ తెలిపారు.
చౌదరిపల్లిలో నల్లబెల్లం పట్టివేత
కొందుర్గు, అక్టోబర్ 21: సారా తయారీకి వినియోగించే నల్లబెల్లంను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా నల్లబెల్లం వ్యాపారం చేస్తున్న వ్యాపారిని అరెస్టు చేసి 110 కిలోల నల్లబెల్లంను స్వాధీనం చేసుకున్నారు. జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో కిరాణ షాపు నిర్వహిస్తున్న టి శ్రీకాంత్ నల్లబెల్లం విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. కుల్కచర్ల మండలం చాకలిపల్లికి నల్లబెల్లం తరలిస్తున్న శ్రీకాంత్‌ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 110 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిఐ తెలిపారు.
నిలకడగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ఆరోగ్యం
రాజేంద్రనగర్, అక్టోబర్ 21: ఇటీవల లోబిపి, షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ పంజగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉందని డాక్టర్లు తెలిపారు.లోబిపి, షుగర్ లెవల్స్ పడిపోయిన కారణంగా కొంచెం అస్వస్థతకు గురయ్యారని, ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడిందని డాక్టర్లు వెల్లడించారు. శనివారం అత్తాపూర్ డివిజన్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వనం శ్రీరామ్‌రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ను కలిశారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో ఆరోగ్య విషయమై వాకబు చేశారు. ఈ సందర్భంగా వనం శ్రీరామ్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కోలుకుంటున్నారని, ఎలాంటి ప్రమాదం లేదని వివరించారు. స్వయంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తనకు వివరించారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ను కలిసిన వారిలో అత్తాపూర్ డివిజన్ టిఆర్‌ఎస్ నాయకులు తదితరులు వున్నారు.