రంగారెడ్డి

స్వైన్‌ఫ్లూతో బాలింత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 21: మేడ్చల్ పట్టణంలోని కసాబ్ బస్తీలో ఓ బాలింత స్వైన్‌ఫ్లూతో శనివారం మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కసాబ్ బస్తీలో నివాసం ఉండే చిట్టిబాబు.. భార్య రాజ్యలక్ష్మి (32) ఇద్దరు చిన్నారి కూతుళ్లతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రాజ్యలక్ష్మి ఎనిమిది నెలల గర్భిణి కావడంతో ఆమెను పుట్టింటి వారు ఇటీవలే తమ తల్లిగారి ఊరైన కామారెడ్డికి తీసుకువెళ్లారు. రాజ్యలక్ష్మికి అక్కడ జలుబు, జ్వరం, దగ్గు తదితర ఆరోగ్య సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు చికిత్స కోసం నగరంలోని లోతుకుంట ప్రాంతంలోని జయప్రద నర్సింగ్‌హోంలో అక్కడి నుండి మారేడ్‌పల్లిలోని గీతా నర్సింగ్‌హోం, విజయ ఆసుపత్రి, కస్తూరి ఆసుపత్రిల్లో చికిత్స చేయించగా తగ్గకపోవడంతో విజయ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి స్వైన్‌ఫ్లూ సొకిందని గాంధీ లేదా యశోద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు రాజ్యలక్ష్మిని యశోద ఆసుపత్రిలో ఈనెల 17వ తేదీన చిక్సిత నిమిత్తం చేర్పించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి స్వైన్‌ఫ్లూతో బాధపడుతోందని నిర్థారించారు. రాజ్యలక్ష్మికి పురిటినొప్పులు రావడంతో ఈనెల 18వ తేదీ రాత్రి సిజేరియన్ ఆపరేషన్ చేయగా పండంటి ఆడపిల్ల పుట్టింది. పుట్టిన ఆడ శిశువు క్షేమంగానే ఉన్నా తల్లి రాజ్యలక్ష్మిని స్వైన్‌ఫ్లూ తీవ్రంగా బాధిస్తుండటంతో ఆసుపత్రిలో బిల్లులు కూడా తడిసి మోపెడవుతుండటంతో చేసేది లేక 20వ తేదీ రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచింది. రాజ్యలక్ష్మి మృతితో నవజాత శిశువుతో పాటు మరో ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు.