రంగారెడ్డి

మహిళా డాక్టర్ హత్యకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, అక్టోబర్ 21: వ్యాపారంలో తలెత్తిన గొడవలు ఒకరిని హత్య చేసేందుకు పథకం పన్నారు. తేరుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసునమోదు చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారిలో ఉన్నారు. శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎల్బీనగర్ డిసిపి వెంకటేశ్వరరావు నిందితుల వివరాలను వెల్లడించారు. పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీ తట్టిఅన్నారంలోని ఇందు అరణ్యలో నివాసం ఉండే డాక్టర్ దుర్గారాణి అదే కాలనీలో ఉండే డాక్టర్ బుర్ర రమేష్‌గౌడ్(45)తో కలిసి కర్మన్‌ఘాట్‌లో జీవన్ ఆసుపత్రిని, పెద్దపల్లిలో శ్రీసాయి ఆసుపత్రిని నెలకొల్పింది. వ్యాపారంలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో బుర్ర రమేష్‌గౌడ్ తన వాటా తీసుకొని వ్యాపారంలో నుండి పక్కకు తప్పుకున్నాడు. వ్యాపారంలో ఇద్దరు మధ్య గొడవలను మనసులో పెట్టుకున్న రమేష్‌గౌడ్ డాక్టర్ దుర్గారాణిని బెదిరించాడు. దాంతో ఆమె రమేష్‌గౌడ్‌పై సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. రమేష్‌గౌడ్ డాక్టర్ కాదని అతని సర్ట్ఫికెట్లు నకిలివని ఫిర్యాదులో పేర్కొంది. అప్పటికే రమేష్‌గౌడ్‌పై పలు కేసులు ఉన్నాయి. ఈ మేరకు సరూర్‌నగర్ పోలీసులు రమేష్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. దుర్గారాణిపై కక్ష్య పెంచుకున్న రమేష్‌గౌడ్ ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. అందుకు గాను వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మహ్మద్ రఫి(52), అదే గ్రామానికి చెందిన జంపాల రమేష్(50), తిరుపతిగౌడ్‌ను ఆశ్రయించాడు. డాక్టర్‌ను చంపేందుకు రూ.10లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా వారికి రూ.5లక్షల నగదు ఇచ్చాడు. రెండు నెలల్లో డాక్టర్ దుర్గారాణిని చంపుతామని వారు ఒప్పందం కుర్చుకున్నారు. బాదితురాలు డాక్టర్ దుర్గారాణి భర్త వై. రమేష్‌బాబుకు ఈనెల 13న గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపుతామని బెదిరించాడు. తనకు వచ్చిన ఫోన్ కాల్స్‌పై హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు మహ్మద్ రఫి, జంపాల రమేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి రూ.45వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు, ఒక టివిని స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో వనస్థలిపురం ఎసిపి రవీందర్‌రెడ్డి, హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్, ఎస్సైలు పాల్గొన్నారు.