రంగారెడ్డి

కొంగర కలాన్ వద్ద కలెక్టరేట్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, అక్టోబర్ 22: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను కొంగర కలాన్ వద్ద ఏర్పాటును వ్యతిరేకిస్తూ జనావేదన సమితి ఆధ్వర్యంలో ఆదివారం షాద్‌నగర్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి పి.శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డితో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు హాజరయ్యారు. షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టకుండా ప్రభుత్వం ఏకపక్షంగా కొంగరకలాన్ వద్ద నిర్మించాలనుకోవడం శోచనీయమని అన్నారు. మహబూబ్‌నగర్ జల్లా నుండి షాద్‌నగర్ నియోకవర్గం రంగారెడ్డి జిల్లాలోకి మారిన తరువాత అభివృద్ధి చెందుతుందంటే.. ఇలా ప్రజల సౌలభ్యం కోసం చూడకుండా ప్రభుత్వం కొంగర కలాన్ వద్ద కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని జిల్లెడు, చౌదరిగూడ, కొందుర్గు, కేశంపేట, షాద్‌నగర్ ప్రజలకు కొంగర కలాన్ వద్ద నిర్మించే కలెక్టరేట్‌కు చేరుకోవాలంటే దూరభారమవుతుందని పేర్కొన్నారు. గతంలో షాద్‌నగర్ నుండి మహబూబ్‌నగర్ చేరుకోవాలంటే 50కిలోమీటర్ల లోపు ఉండేదని, ఇపుడేమో 100 కిలోమీటర్ల వరకు అవుతోందని తెలిపారు. దీంతో కారు లేనిదే కలెక్టరేట్ చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని, పేద ప్రజల పరిస్థితి వ్యయ ప్రయాసలకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. మాజీ మంత్రి పి.శంకర్ రావు మాట్లాడుతూ ఈ సమస్య ఇప్పటికే జఠిలం కావడంతో పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.
కలెక్టరేట్ భూమిపూజ జరుగకముందే ఈ ఆందోళన జరిగి ఉంటే ఫలితం వచ్చేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ షాద్‌నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లికి చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఉద్యమిస్తే ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి విశ్వం, కొందుర్గు పిఎసిఎస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, జనావేదన కన్వీనరు వంగూరి గంగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సరాపు జగదీశ్వర్, రాజావర ప్రసాద్, పినపాక ప్రభాకర్, జర్నలిస్టు లట్టుపల్లి మోహన్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ బిపి నర్సింహా రెడ్డి, నాగిళ్ల గోపాల్ గుప్త, టిడిపి నాయకుడు తిరుపతి రెడ్డి, బిజెపి నాయకుడు కక్కునూరి వెంకటేష్ గుప్త, మాజీ సర్పంచ్ బాలరాజు గౌడ్, బిసి సంక్షేమ సంఘం నాయకుడు అశోక్ గౌడ్, ఉపాధ్యాయురాలు అనురాధ పాల్గొన్నారు.

నకిలీ సర్ట్ఫికెట్ల ముఠా గుట్టురట్టు

*ఇద్దరి అరెస్ట్

వనస్థలిపురం, అక్టోబర్ 22: ఇంటర్, డిగ్రీ, పిజి సర్ట్ఫికెట్లు ఇప్పిస్తామని మోసం చేసి నిరోద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. లక్ష రూపాయలు, ప్రింటర్, వివధ కళాశాలలకు సంబంధించిన నకిలీ సర్ట్ఫికెట్లు, నకిలీ స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఎల్బీనగర్‌లోని డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను డిసిపి వెంకటేశ్వర్ రావు వెల్లడించారు. గుంటూరుకి షేఖ్ బషీర్ మహ్మద్ (49) గుంటూర్‌లో కొన్ని రోజులు న్యాయవ్యాదిగా పనిచేసి సక్సెస్ కాకపోవడతంలో 2011లో నగరానికి వచ్చి ముషీరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. 2012 నుండి చైతన్యపురిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పలు కళాశాలల నుండి ఒరిజినల్ ఇంటర్, డిగ్రీ, పిజి సర్ట్ఫికెట్లను ఇప్పిస్తానని పలువురిని నమ్మించి డబ్బులు వసూలు చేసి వారికి నకిలీ సర్ట్ఫికెట్లను అందజేస్తున్నాడు. 2013లో చైతన్యపురిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ కార్యాలయాన్ని నడిపిస్తున్న వంశీకృష్ణ పరిచయం అయ్యాడు. అప్పటి నుండి వంశీకృష్ణ తన వద్దకు ఉద్యోగాల కోసం వచ్చేవారిని.. డిగ్రీ సర్ట్ఫికెట్లను కావాలంటే బషీర్ ఇప్పిస్తాడని అతని వద్దకు పంపించేవాడు. బషీర్ ఒక సర్ట్ఫికెట్‌కు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు డబ్బులు తీసుకుని నకిలీ సర్టిఫికెట్ల్లు ఇచ్చి మోసం చేస్తున్నాడు.