రంగారెడ్డి

నియోజకవర్గం అభివృద్ధికి సిఎంని కలవడానికి సిద్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, అక్టోబర్ 22: కొడంగల్ నియోజవర్గం అభివృద్ధి కోసం అవసరమైతే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను, నియోజకవర్గ టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి మాట్లడేందుకు సిద్ధమని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గోన్న రేవంత్ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిర్ణయమని, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న కార్యాలయాలను ఇక్కడి నుండి తరలించడం ప్రజలను ఇబ్బందికి గురి చేయడమేనని, ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీలకతీతంగా అందరు వ్యతిరేకిస్తున్నారని, మంత్రి వెంటనే కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు.
ప్రజల సౌకర్యం కోసం కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఉన్నవాటిని తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా ఖండించారని, గురునాథ్ రెడ్డి.. సిఎం అపాయింట్‌మెంట్ తీసుకుంటే అతనితో కలిసి వెళ్లి నియోజకవర్గ అభివృద్ధి విషయం గురించి చర్చించేందుకు సిద్ధమని అన్నారు. తన సొంత నిధులతో బస్ డిపో ఏర్పాటు కోసం స్థలం కొనడమే కాకుండా అవసరమైన నిధులు సైతం సిద్ధంగా ఉన్నా పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోందని రవాణాశాఖ మంత్రిగా ఉన్న మహేందర్‌రెడ్డి ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు. రాష్ట్రంలో 472 గ్రామాలకు నేటికి రోడ్డు సౌకర్యం లేదని, పాత పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 172 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకుంటే ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 47 గ్రామాలకు నేటికి రోడ్డు సౌకర్యం లేకపోవడం అభివృద్ధి విషయంలో ఎంతగా వెనుకబడి పోయిందనే విషయానికి నిదర్శనమని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో కలిసిన మూడు మండలాల్లో కొడంగల్ తప్ప బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో నేటికీ ప్రభుత్వ కళాశాలలు లేవని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గేయిల్‌తో మాట్లడి అవసరమైన నిధులు ఇచ్చేందుకు వారిని ఒప్పించినట్లు రేవంత్ తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పెద్దగా ఒరిగిందేమి లేదని ఇటీవల గురునాథ్ రెడ్డి ప్రకటించారని, జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యాలు అందినపుడే జిల్లాల ఏర్పాటును అందరు స్వాగతిస్తారని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ రాజేందర్ రెడ్డి, ఎంపిడిఒ హరినందన్ రావు పిఆర్ ఎఇ గోపాల్ పాల్గొన్నారు.

ఎస్‌జిఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్-17 బాలబాలికల త్రోబాల్ టోర్నీ చాంప్స్ నిజామాబాద్, నల్గొండ
చాంద్రాయణగుట్ట, ఆక్టోబర్ 22: స్కూల్ గేమ్స్ సమాఖ్య తెలంగాణ పర్యవేక్షణలో రంగారెడ్డి జిల్లా ఎస్‌జిఎఫ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-17 బాలబాలికల త్రోబాల్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ పొటీలో నిజామాబాద్, నల్గొండ జట్లు విజేతలుగా నిలిచాయి.
పది జిల్లాల నుండి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. రాయిదుర్గలోని ఓయాసిస్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించిన ఈ పోటీల ఫైనల్లో బాలుర విభాగంలో నిజామాబాద్ జట్టు 15-13, 15-12 పాయింట్ల తేడాతో ప్రత్యర్థి హైదరాబాద్‌పై విజయం సాధించింది.
మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో నల్గొండ జట్టు 15-11, 15-9 స్కోరుతో కరీంనగర్‌పై విజయం సాధించింది. బాలికల విభాగంలో నిర్వహించిన ఫైనల్లో నల్గొండ 15-10, 15-11 పాయింట్ల తేడాతో హైదరాబాద్‌పై నెగ్గింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్ జట్టు 15-10, 15-13 పాయింట్ల తేడాతో కరీంనగర్‌పై గెలుపొందింది.
అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కృష్ణ విచ్చేసి గెలుపొందిన జట్లకు ట్రోఫీలను అందజేశారు.
కార్యక్రమంలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ కామేశ్వరి, కృష్ణ యాదవ్, పి.జగన్‌మోహన్ గౌడ్, మహ్మద్ సమీయుద్దిన్ పాల్గొన్నారు.