రంగారెడ్డి

లాభసాటిగా వ్యవసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 22: మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించడంతో రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు అన్నారు. రాజేంద్రనగర్‌లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంలో బిందు సేద్యంతో నీరు, ఎరువుల యాజమాన్యంపై వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోరమండల్ ఫర్టిలైజర్స్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన రైతు సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులు వ్యవసాయాన్ని వాణిజ్యపరంగా చేయడంతో పంటల ఖర్చు, దిగుబడి, రాబడి పెరుగుతుందని డాక్టర్ ప్రవీణ్‌రావు అన్నారు. పంటలకు అవసరమైన మేరకు నీరు, ఎరువులను అందించడానికి బిందు సేద్యం ఎంతో అనుకూలమైందన్నారు. ఎరువులు అధికంగా వాడటంతో ఎక్కువ దిగుబడి వస్తుందనే మాట అపోహ మాత్రమేనని, మొక్కలకు సరిపడ ఎరువులను అందించడంతో మాత్రమే దిగుబడి అధికంగా వస్తుందన్నారు. బిందు సేద్యంలో వివిధ పంటలకు అవసరమైన ఎరువుల వాడకంపై ప్రణాళికను రూపొందించుకొని దాన్ని అమలు జరపాలని రైతులకు సూచించారు. కోరమండల్ ఫర్టిలైజర్స్ ఉప అధ్యక్షుడు జివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రసాయనిక ఎరువులను పరిమితికి మించి వాడొద్దని రైతులకు సూచించారు. విచక్షణారహితంగా ఎరువులు వాడితే కష్టాలు తప్పవని అన్నారు. సేంద్రియ రసాయనిక ఎరువులను సమపాళ్లలో వాడటంతో భూసారం దెబ్బతినకపోవడమే కాకుండా ఆశించిన దిగుబడులు వస్తాయని చెప్పారు. రైతు సదస్సుకు మహాబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన రైతులు, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దక్షిణ ప్రాంతీయ అధికారి వైవిఎన్ మూర్తి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ టి.ప్రదీప్, నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం సంచాలకుడు డాక్టర్ ఉమాదేవి, కోరమండల్ ఫర్టిలైజర్స్ ప్రతినిధులు పి.్భస్కర్ రెడ్డి, పివి రాజు, ఇవి సుధాకర్, డాక్టర్ టి.సుధాకర్ రెడ్డి, పి.ప్రసాద్ పాల్గొన్నారు.

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
ఉప్పల్, అక్టోబర్ 22: ఆదివారం సాయంత్రం ఉరుములు..మెరుపులతో ఉప్పల్ పట్టణంలో భారీ వర్షం కురిసింది. రెండున్నర గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనం తడిసి ముద్దయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదార్లు చెరువు, కుంటలు తలపిస్తున్నాయి. మురికి కాలువలు, ఓపెన్ నాలాలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వచ్చిపోయే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదార్లలో నిలిచిపోయిన వరద నీటి ప్రవాహానికి ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోగా, జారి పడి పలువురు వాహనాదారులు గాయపడ్డారు.
ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి వరకు, సర్వే ఆఫ్ ఇండియా ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి రింగ్‌రోడ్డు మీదుగా నాగోల్ బ్రిడ్జి వరకు, రామంతాపూర్ టివి స్టేషన్ వరకు జాతీయ రహదారిలో వర్షం నీరు బయటకు వెళ్లేందుకు మార్గంలేక రోడ్డు మధ్యలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో బయట పడేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. కొన్ని వాహనాల సైలెన్సర్‌లలోకి నీళ్లుపోయి ఆగిపోయాయి. స్థానిక వ్యాపారులు రోడ్డు డివైడర్లను తొలగించి వరద నీటిని బయటకు మళ్లించారు. వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ వైపుకు వచ్చిన బస్సులలో దిగిన ప్రయాణీకులు, పనులు ముగించుకుని ఇంటికి వచ్చే ప్రయాణికులు ఇళ్లలోకి చేరడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. రామంతాపూర్ చెరువు సమీపంలోని ముంపు ప్రాంతాల ప్రజల్లో మళ్లీ భయం నెలకొంది. చెరువు నిండి ఇళ్లలోకి వరద నీరు వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి వరద నీరు పోయి జన జీవనం స్తంభించింది. విలువైన వస్తువులు, బియ్యం తడిసి చలితో ఇబ్బందులు పడ్డారు. చిల్కానగర్, స్వరూప్‌నగర్ వైపు వెళ్లే మార్గంలో ఇరుకైన కల్వర్టువద్ద వాహనాలు నిలిచిపోవడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఉన్నారో ఏమో కానీ ట్రాఫిక్ సుడిగుండంలో ప్రజలు అవస్థలు పడ్డారు. వర్షం వచ్చినపుడు రోడ్లలో నిలవకుండా తక్షణమే వెళ్లేలా శాశ్వత తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జంట పురపాలక సంఘాలలో..
జంట పురపాలక సంఘాలైన బోడుప్పల్, పీర్జాదిగూడలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనం తడిసి ముద్దయ్యారు.
వరంగల్ జాతీయ రహదారిలోని బోడుప్పల్ చౌరస్తా, బస్‌డిపో, ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తా, హేమానగర్ వెళ్లే రహదారిలోని బొమ్మక్ బాలయ్య ఫంక్షన్ హాల్, గంగయ్య గార్డెన్, చెంగిచర్ల ఎంఎల్‌ఆర్ కాలనీ వంటి లోతట్టు ప్రాంతాలలో వరద నీటితో జనం పడిన కష్టాలు ఎన్నో.
జలమయమైన కాలనీలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎగువ ప్రాంతాల నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మురికి కాలువల కింది ప్రాంతాల ప్రజలు భయం నీడలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
నగరంలో..
ఖైరతాబాద్: నగరంలో ఆదివారం సాయంత్రం మళ్లీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, బేగంపేట, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఓ మోస్తారుగా, మిగిలిన ప్రాంతాల్లో సన్నటి జల్లు కురిసింది. వర్షంతో బేగంపేట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి.
ఆదివారం కావడంతో వాహనాల సంఖ్య తక్కువగా ఉండటం సాధారణ వర్షపాతమే నమోదు కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తలేదు. గత నెల 28 నుంచి నిన్నమొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలం అయిన నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా నగరంపై నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. చిన్న జల్లులు పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అత్యవసర సేవలకు సిద్ధమైన బల్దియా
ఆదివారం సాయంత్రం వర్ష సూచన తెలుసుకున్న వెనువెంటనే బల్దియా అత్యవసర సేవలకు సమాయత్తం అయింది. చిన్నపాటి వర్షానికే జలమయం అయే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా ప్రాంతాలకు సిబ్బందిని పంపించారు. భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే ప్రాంతాలకు నీటిని తోడే మోటర్లను వాహనాల్లో తరలించారు.