రంగారెడ్డి

పెట్రోల్ బంకుల్లో దగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 22: గతంలో పదిహేను రోజులకు ఒకసారి మారే పెట్రోల్ ధరలకు భిన్నంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రోజుకోసారి మారే ధరలతో పెట్రోల్ బంకు మాయాజాలంతో వినియోగ దారుడి జేబులకు చిల్లుపడుతోంది. ప్రభుత్వ విధానాన్ని ఆసరగా తీసుకొని వినియోగదారులను బంకులు మోసం చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ సమీక్షా విధానంతో అవకతవకలకు వినియో గదారుడు తీవ్రంగా నష్టపోతున్నాడు. గత జూన్ నెల 16వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్త విధానంతో ఏ రోజు ధర ఆ రోజే మారుతున్న సం గతి అందరికీ తెలిసిందే. ఈ మార్పు ఎలా జరుగుతుందో, అసలు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు వీటిని పాటిస్తున్నారో? లేదో? కూడా తెలియడం లేదు. కొత్త విధానం ప్రవేశపెట్టిన నాటి నుండి స్థానిక బంకుల్లో ధరలు పైపైకి పోవడమే కానీ ఏనాడూ దిగివచ్చింది లేదు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో 40కి పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిల్లో ఎక్కడా కూడా పెట్రోల్ ధరలు సమానంగా లేవంటేనే పరిస్థితిని అంచనా వేయవచ్చు. నిత్యం మారుతున్న పెట్రోల్ ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్‌ల యాజమానులు పెట్రోల్ ధరలు తగ్గిన రోజున బంక్‌లను మూసి వేస్తూ, ధరలు పెరిగిన వేళ మాత్రమే బంక్‌లను తెరుస్తున్నారు. కొలతల్లోనూ తేడాలు ఉండడంతో వినియోగదారులు నష్టపోవాల్సి వస్తోంది. నాణ్యత విషయంలో, రీడింగ్‌లో తేడాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. లీటరు పెట్రోల్ కొట్టిస్తే 50-60 మైలేజీ ఇచ్చే వాహనాలు కేవలం 40 కి.మీ మాత్రమే ఇస్తున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అసలు రీడింగ్‌లో చూపించిన విధంగా పెట్రోల్ ట్యాంకుల్లో నిండుతుందో? లేదో? కూడా తెలియడం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో డీజిల్ ధరలు రూ. 63 నుండి రూ. 61 మధ్య నమోదు కాగా, ప్రస్తుతం లీటరు రూ. 62గా నమోదయ్యింది. అదేవిధంగా పెట్రోల్ ధరలు గత పది రోజులుగా రూ. 74.57 నుండి రూ. 72.15గా నమోదయ్యాయ. ప్రస్తుతం పెట్రోల్ ధరలు 72-73 రూపాయల మధ్యలో నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ కింది స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆ ధరలకు అనుగుణంగా నమోదు కావడం లేదన్నది వాస్తవం. పెట్రోల్, డీజిల్ ధరలపై అవగాహన లేని వినియోగదారులు మాత్రం పెట్రోల్ బంక్ యాజమాన్యాల మోసాలతో నిలువుదోపిడీకి గురవుతున్నారు.
కల్తీతోనూ మోసాలే..
రోజురోజుకూ పెట్రోల్ ధరలు మారిపోవడంతో పాటు పెట్రోల్, డీజిల్ కల్తీ వ్యాపారం కూడా సాధారణంగా మారిపోయింది. చాలా వరకు బంకుల్లో స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ లభించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. పెట్రోల్, డీజిల్‌లు కల్తీ అవుతున్నాయని మైలేజ్‌ని బట్టి తెలుస్తోందని పేర్కొంటున్నారు. కల్తీల వల్ల వాహనాలు చెడిపోయి మరమ్మతులకు వేలాధి రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. తూనికలు, కొలతలశాఖ అధికారులు తక్షణమే స్పందించి బంకుల యాజమాన్యాల మోసాలను అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. నిత్యం నమోదయ్యే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎప్పటికప్పుడు ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
కొలువుల కొట్లాట సభకు ఉద్యాన విద్యార్థుల మద్దతు

రాజేంద్రనగర్, అక్టోబర్ 22: జెఎసి చైర్మెన్ కోదండరామ్ తలపెట్టనున్న కొలువుల కొట్లాట సభకు ఉద్యాన విద్యార్థుల మద్దతు ఉంటుందని ఉద్యాన విద్యార్థి నాయకులు తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ కల్పనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఉద్యాన డిప్లొమా, బిఎస్సీ, ఎమ్మెస్సీ, ఉద్యాన పిహెచ్‌డి చేసినా ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వ్యవసాయ పంటలలో లాభసాటి ఆదాయం లేదని, రైతులు ఆత్మహత్యలు తగ్గాలంటే ఉద్యాన పంటలతో మాత్రమే సాధ్యమని స్వయంగా సిఎం కెసిఆర్, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిలే చిలకపలుకులు పలికి నేడు పట్టించుకోవడం లేదని అన్నారు.