రంగారెడ్డి

శంషాబాద్‌లో జిల్లా కేంద్రం హామీని నిలబెట్టుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, ఆక్టోబర్, 23 శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ బెంగళూర్ జాతీయ రహదారి, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్‌తో పాటు అన్ని సౌకర్యాలు కలిగిన శంషాబాద్ పట్టణంలోనే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి, బిజెపి ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం శంషాబాద్ ఎంపిపి చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే ఒక్కసారిగా సర్పంచ్‌లు రాచమల్ల సిద్ధేశ్వర్, మహేందర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, సిద్ధులు, ఎంపిటిసిలు జ్ఞానేశ్వర్, అరవింద్‌తో పాటు సభ్యులంతా కలిసి శంషాబాద్‌లోనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని జై శంషాబాద్.. అంటూ.. పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎంపిపి చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ మాట్లాడుతూ.. శంషాబాద్‌లో వర్ధమాన్ కాలేజ్, ఐఎంటి కాలేజ్, నోవాటెల్ హోటల్, డీసీపీ కార్యాలయం, 111 జీఓలో ఎలా నిర్మించారని మండిపడ్డారు. కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి 111 జీవో అడ్డు అని చెబుతున్న ప్రభుత్వం.. వేలాది మంది విద్యార్థులు చుదువుకునే కాలేజీలు, డీసీపీ కార్యాలయం, హుడా కార్యాలయాలు ఎలా నిర్మించారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం.. శంషాబాద్‌లోనే జిల్లా కార్యాలయం నిర్మించాలని డిమాండ్ చేశారు. షాద్‌నగర్, చౌదరిగూడ, షాబాద్, చెవెళ్ల, శేరిలింగంపల్లి తదితర మండలాలకు శంషాబాద్ మధ్యలో ఉందన్నారు. శంషాబాద్‌ను జిల్లాగా ప్రకటిస్తామని చెప్పిన తర్వాత రంగారెడ్డి జిల్లా పేరు వున్న శంషాబాద్‌లోనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ మాట తప్పి కొంగర రావిర్యాలలో జిల్లా కేంద్రానికి భూమి పూజ చేయడం జిల్లా ప్రజలను మోసం చేయడం అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మాట ప్రకారం శంషాబాద్‌లోనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని సర్పంచ్‌లు, ఎంసిటిసిలు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించి కార్యాలయం ముందు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కెసిఆర్, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి చొరవ తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని.. రాజీనామాలు చేయడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

హెచ్‌సిఎ ఇంటర్ స్కూల్ లీగ్ క్రికెట్ టోర్నీలో
శ్రీనిధి, మెరీడియన్, డిపిఎస్ జట్ల గెలుపు
చాంద్రాయణగుట్ట, అక్టోబర్ 23: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ లీగ్ టోర్నమెంట్‌లో డిపిఎస్ నాచారం, శ్రీనిధి ఇంటర్నేషనల్, మేలూవ స్కూల్, మెరీడియన్, భవన్స్, గౌతం మోడల్ స్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్ జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించాయి. సెయింట్ పీటర్స్ స్కూల్‌పై నాలుగు వికెట్ల తేడాతో డిపిఎస్ నాచారం జట్టుపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ పీటర్స్ స్కూల్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డిపిఎస్ 26.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి లక్ష్యాన్ని అధిగమించింది. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు ఐదు వికెట్ల తేడాతో భవన్స్ ఆర్‌పై నెగ్గింది. భవన్స్ జట్టు 46.4 ఓవర్లలో 160 పరుగుల వద్ద ఆలౌటైంది.
అందుకు బదులుగా బ్యాటింగ్ చేసిన శ్రీనిధి జట్టు 38.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రాణించిన సి.ఉదయ్‌కిరణ్‌రెడ్డి 171, కె.నితీష్ 120 పరుగులతో సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ బరిలోకి దిగిన మేలువ స్కూల్ 42.5 ఓవర్లలో 399 పరుగులు చేసింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన జెనిసీస్ ఇంటర్నేషనల్ స్కూల్ 29.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో మెరీడియన్ స్కూల్ 14 పరుగుల తేడాతో ఓబుల్‌రెడ్డి స్కూల్‌పై, హెచ్‌పిఎస్ రామంతపూర్ ఎనిమిది వికెట్ల తేడాతో కైట్స్ జూనియర్ కాలేజీపై, భవన్స్ స్కూల్ 82 పరుగులతో సాక్రెడ్ హార్ట్‌పై, గసతం మోడల్ స్కూల్ జట్టు 145 పరుగుల తేడాతో శ్రీ చైతన్య స్కూల్‌పై, సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్‌పై ఒక పరుగు తేడాతో జాన్సన్ గ్రామర్ స్కూల్ విజయం సాధించి చేరి 5 పాయింట్లు గెలుచుకున్నారు.
సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి
కీసర, అక్టోబర్ 23: జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.