రంగారెడ్డి

ప్రజావాణి దరఖాస్తులకు అధికారులే జవాబుదారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, అక్టోబర్ 23: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందుతున్న దరఖాస్తుల పట్ల సంబంధిత శాఖల జిల్లా డివిజన్ మండల స్థాయిలలో అధికారులు శ్రద్ధ చూపి ప్రజలకు జవాబుదారీతనం ప్రదర్శించాలని కలెక్టర్ డి.దివ్య పేర్కొన్నారు. సోమవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిశీలనకు సంబంధిత అధికారులకు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణిలో ప్రజలు తమకు సత్వర న్యాయం చేకూరుతుందనే భరోసాతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తమ సమస్యలను విన్నవించుకుంటున్నట్లు పేర్కొన్నారు. అన్ని స్థాయిల అధికారులు ప్రజలకు వారి సమస్యల స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులు పాతవి మళ్లీ పునరావృత్తం కాకుండా అధికారులు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. కాగా తాండూరు ప్రజావాణిలో మొత్తం 76 దరఖాస్తులు అందినట్లు ప్రజావాణి ఆన్‌లైన్ సిబ్బంది వెల్లడించారు.
లక్ష సర్వే నెంబర్ల ప్రక్షాళన పూర్తి
జిల్లాలో లక్ష సర్వే నెంబర్ల ప్రక్షాళన పూర్తయిందని కలెక్టర్ దివ్య వెల్లడించారు. జిల్లా మొత్తంలో ఐదు లక్షల వరకు సర్వే నెంబర్లు ఉండగా డిసెంబర్ మాసం చివరి నాటికల్లా మొత్తం భూముల రికార్డుల పరిశీలనలు, సర్వేలు పూర్తి చేస్తామని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది భూముల సర్వేలలో రైతులకు ఎలాంటి అన్యాయం జరక్కుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అకాల వర్షాలతో పంటను నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. బీమా ప్రీమియం చెల్లించని రైతులకు ప్రభుత్వం ప్రకటిస్తేనే బీమా సౌలభ్యం ఉంటుందని అన్నారు. తాండూరులో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు త్వరలో మోక్షం లభిస్తుందని వెల్లడించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు మళ్లీ 40వేల దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. డిసెంబర్ చివరి నాటికల్లా జిల్లాలోని ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ఓడిఎఫ్ సాధిస్తామని పేర్కొన్నారు. తాండూరులో లారీ పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం లారీ పార్కింగ్ కోసం పట్టణ శివారులో ఉన్న పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామ పరిసరాలలో ఉన్న ఆర్టీఎ డ్రైవింగ్ ట్రాక్ స్థలం పరిసరాలలో 12 ఎకరాల ఖాళీ స్థలంలో అవసరం మేరకు భూమిని తాండూరు లారీ పార్కింగ్‌కి మార్కింగ్ చేసి ఇస్తామని అన్నారు. తాండూరు ప్రాంతంలో పిల్లలు, చిన్నారులు, పసికందుల అక్రమ దత్తతలు జోరుగా సాగుతున్న అంశంలో సంబంధిత అధికారులతో పర్యవేక్షణ చేపట్టినట్లు పేర్కొన్నారు. తాండూరు బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రూ.21 కోట్లు నిధులు కేటాయించినట్లు కలెక్టర్ వివరించారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి తాండూరు మండం అంతారం గ్రామ రైతులు 41 మందికి చెందిన 20.16 ఎకరాలు, యాలాల్ మండలంలో కోకట్ గ్రామానికి చెందిన 70 మంది రైతులకు చెందిన 40.23 ఎకరాలు, తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన 47 మంది రైతులకు చెందిన 23.17 ఎకరాల భూములు, యాలాల్ మండలం రసూల్ పూర్‌కు చెందిన 16 మంది రైతులకు చెందిన 5.35 ఎకరాల భూముల నిర్వాసితులకు పరిహారం అందిస్తామని ప్రకటించారు.
గొల్లచెరువు ఏరియాలో కలెక్టర్ పాదయాత్ర
తాండూరు పట్టణంలో నెలన్నర కాలంగా డెంగీ భయం నెలకొంది. అందుకు అనుగుణంగా పట్ణంలోని పాత తాండూరు, ఇందిరానగర్ సీతారాంపేట్ తదితర ప్రాంతాలలో నాలుగు డెంగీ కేసులు సైతం నమోదు అయ్యాయి. కాగా ప్రస్తుతం పట్టణంలో డెంగీ ప్రభావం అంతగా లేదని స్థానిక వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తాండూరులో డెంగీ ప్రభావం చూపటంతో అధ్యాయనం చేపడుతున్నట్లు కలెక్టర్ డి.దివ్య పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం గొల్లచెరువు ఏరియాలో పాదయాత్ర చేపట్టారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే అపరిశుభ్రతా వాతావరణం నెలకొందని కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో పారిశుద్ధ్యం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ బి.సునీతా సంపత్, కౌన్సిలర్లు రజాక్, శ్రీనివాస్, రవి కుమార్, జి.పరిమళ, మున్సిపల్ శానిటరీ అధికారి విక్రమ్ సింహారెడ్డి, తహశీల్దార్ రాములు ఉన్నారు.
జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్
తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న దుర్భర పరిస్థితులను కలెక్టర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. కళాశాల ముఖ ద్వారం ముందున్న ఫౌంటైన్‌లో నీరు మురికి ఉండటంతో కళాశాల లెక్చరర్‌లపై మండిపడ్డారు. జూనియర్ కళాశాల భవనం శిధిలావస్థలో ఉన్న భాగాన్ని కూల్చీ వేయకుండా ఉంచటంపై కలెక్టర్ విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రాణాపాయంగా మారిన శిథిల భవనాన్ని ఎందుకు పూర్తి కూల్చివేయలేదంటూ కళాశాల సిబ్బందిని ప్రశ్నించారు. వెంటనే కళాశాల శిథిల భవనాన్ని పూర్తిగా కూల్చివేయాలని, తాండూరు డిఎస్పీ ఎం.రామచంద్రుడును ఆదేశించారు. కూల్చివేతకు అవసరమైన నిధులు వెంటన విడుదల చేస్తామని తెలిపారు. కలెక్టర్ కళాశాలను సందర్శించినపుడు కాలేజి ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ లేరు. అనంతరం కలెక్టర్ తనకు అందిన ఫిర్యాదుల మేరకు కళాశాలలో దుర్భర పరిస్థితిలో ఉన్న విద్యార్థుల మరుగుదొడ్లను చూసి నివ్వెర పోయారు. అనంతరం తాండూరు జిల్లా ఆసుపత్రిలోకి వెళ్లి అక్కడ వైద్యాధికారులు అందుబాటులో లేకపోవటంతో తక్షణం వెనుదిరిగారు.