రంగారెడ్డి

క్యాబ్‌లో అరాచకం..దూకిన మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, అక్టోబర్ 23: అర్ధరాత్రి క్యాబ్ ఎక్కిన మహిళా ప్రయాణికులపట్ల నలుగురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. వారి నుంచి బయటపడేందుకు ఓ మహిళ కారులో నుండి దూకేసింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు పోలీసులు కథనం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో చంపాపేట్‌కు చెందిన మహిళ (33) తన స్నేహితురాలుతో కలిసి ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి వద్ద వేచి ఉంది. హయత్‌నగర్‌లో పని నిమిత్తం వెళ్లాల్సి ఉండగా వారు అక్కడి నుండి వస్తున్న క్యాబ్‌ను ఆపారు. అప్పటికే కారులో డ్రైవర్‌తో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. కారులో ఎక్కిన మహిళల పట్ల వారు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టడంతో పెద్దఅంబర్‌పేట్ ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలో మహిళలు కారు ఆపాలని కోరారు. అయతే, కారును ఆపకపోవడంతో సదరు మహిళ కారులో నుంచి కిందకు దూకేసింది. వెంటనే సదరు దుండుగులు వారి వద్ద ఉన్న కొంత నగదు, సెల్‌ఫోన్‌లను లాక్కొని పారిపోయారు. అక్కడి నుండి హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
వికారాబాద్, అక్టోబర్ 23: ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడి వలన మానవుడు పలు రోగాల బారిన పడుతున్నారని, దీనికి నిత్యం యోగా సాధనతో నివారణ లభిస్తుందన పతంజలి యోగ సమితి రాష్ట్ర యువ ప్రభారి పి.శివకుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీరామమందిరంలో ఏర్పాటు చేసిన వికారాబాద్ జిల్లా యోగ సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివకుమార్ మాట్లాడుతూ గత రెండున్నర దశాబ్దాలుగా స్వామి రామ్‌దేవ్‌బాబా యోగాను అందరికీ అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. లక్షలాదిమంది యోగ సాధన వలన అసాధ్యం కాని రోగాలను తగ్గించుకున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో యోగ కేంద్రాలను ప్రారంభించాలని, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సైతం యోగ శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రతి జిల్లాలో సహయోగ శిక్షకుల కోసం సర్ట్ఫికెట్ కోర్స్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రజలు విరివిగా ఉపయోగించుకునే విధంగా ప్రయత్నించాలని అన్నారు. సమావేశంలో భారత స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు కె.వీరేశం, యోగ సమితి జిల్లా అధ్యక్షుడు ప్యాట మల్లేశం, కోశాధికారి కె.వీరభద్రయ్య, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనంతయ్య, జె.వీరేశం, యోగ సాధకులు గురుపాదప్ప, వీరన్న, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

బంగారం, నగదు చోరీ
కీసర, అక్టోబర్ 23: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన సంఘటన నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నాగారం గ్రామం, ఈస్ట్ గాంధీనగర్‌లో నివాసముంటున్న మధుసూదన్ గత కొంతకాలం నుంచి అనారోగ్యంగా ఉండటంతో కుటుంబీకులతో కలిసి సోమవారం చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన వారికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న ఆరు తులాలు బంగారు ఆభరణాలు, 40 వేల రూపాయల నగదు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లినట్లుగా తెలిపారు. వెంటనే బాధితుడు మధుసూదన్ కీసర పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.