హైదరాబాద్

స్కూల్ బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, నవంబర్ 17: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన అక్షర టాలెంట్ స్కూల్ బస్సు శుక్రవారం ఉదయం మహబుబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామ సమీపంలో బోల్తా పడ్డ సంఘటన చోటుచేసుకుంది. సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్వల్ప గాయలతో విద్యార్థిని విద్యార్థులు బయటపడ్డారు. తలకొండపల్లి మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్వాయిపల్లి, తొమ్మిది రేకుల గ్రామాల నుండి సుమారు 40మందికిపైగా విద్యార్థులు బస్సులో స్కూల్‌కు ప్రతి నిత్యం వస్తుంటారని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఎక్వాయిపల్లి గ్రామం నుండి బస్సులో 34 మంది పిల్లలతో తొమ్మిదిరేకులకు వస్తుండగా మార్గమధ్యలో బస్సు స్టీరింగ్ నట్టు ఉడిపోయి ప్రమాదానికి గురైందని పేర్కొన్నారు. బస్సు మూడు పల్టీలు కొట్టినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మూడు రోజుల క్రితం సాయి సహస్ర మోడల్ స్కూల్‌కు చెందిన బస్సు కేశంపేట్ మండల పరిధిలోని నిర్ధవెల్లి సమీపంలో రోడ్డుపై నుండి బస్సు అదుపి తప్పి క్రింద పడిపోయింది. అపుడు బస్సులో సుమారు 18 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని, కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్వల్ప గాయాలతో విద్యార్థులు బయట పడ్డామని స్థానికులు పేర్కొన్నారు. అక్షర స్కూల్‌లో 500 మందికిపైగా, సాయి సహస్ర మోడల్ స్కూల్‌లో 200 మందికిపైగా విద్యార్థులు ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారని తలకొండపల్లి మండల విద్యాధికారి సర్దార్ నాయక్ తెలిపారు.
ప్రభుత్వ భూముల వివరాలివ్వండి
కీసర, నవంబర్ 17: సోమవారంలోగా వివిధ శాఖలకు కేటాయించిన ప్రభుత్వ భూముల వివరాలు జిల్లా అధికారులు సమర్పించాలని మేడ్చల్ జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధర్మారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఆసుపత్రులు, పశువైద్యశాలలు, దుకాణాల సముదాయాలు, క్రీడామైదానాలు, అంగన్‌వాడీలు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లతో పాటు, పంచాయతీ భవనాలు, అటవీ, పౌరసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ గోదాములు, పరిశ్రమలు, వివిధ శాఖల భవనాలు, వాటి వివరాలను సర్వే నెంబర్ల వారీగా నిర్ధేశిత నమూనాలో సోమవారంలోగా సమర్పించాలని కోరారు. మండలం, గ్రామం, సర్వే నెంబర్, భూమి విస్తీర్ణం, ఖాళీ ప్రదేశం, పట్టా భూములైతే, వాటికి సంబంధించి కేటాయింపు వివరాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. గ్రామ కంఠంలోని భూములతో పాటు, పట్ట్భాములను కేటాయించినట్లయితే ఆ వివరాలను సమర్పించాలని అన్నారు. దాతలు విరాళాలుగా ఇచ్చిన భూముల వివరాలు తెలపాలని జెసి ధర్మారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో లాఅధికారి చంద్రారెడ్డి, డీఆర్‌డీఓ కౌటిల్య, డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ దాస్యానాయక్, డీఈఓ ఉషారాణి, డీపీఓ సురేశ్‌మోహన్ పాల్గొన్నారు.

దంపతులను తపంచాతో బెదిరించిన దుండగుడు
కీసర, నవంబర్ 17: గుర్తు తెలియని దుండగుడు తపంచాతో వృద్ధ దంపతులపై దాడి చేసిన ఘటన కరీంగూడలో చోటు చేసుకుంది. స్ధానికుల సమాచారం మేరకు.. ఘట్‌కేసర్ మండలం, యనంపేట్‌కు చెందిన బాలాంజలి (60)తో కలిసి భర్త ధశరధ (65) ద్విచక్రవాహనంపై కొండాపూర్ నుండి యనంపేట్‌కు వెళ్తున్నారు. కీసర మండలం, కరీంగూడలోని రైస్‌మిల్ వద్ధకు రాగానే ఎరుపురంగు పల్సర్ బైక్‌పై గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వృద్ధ దంపతులకు అడ్డంగా ఆపాడు. నాటు తుపాకీ (తపంచా) చూపిస్తూ బాలాంజలి మెడలోని బంగారు ఆభరణాలు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. ఆమె నగలు ఇవ్వనని కేకలు వేయటంతో అటుగా వస్తున్న కొందరు వారి వద్దకు పరుగుతీసారు. గమనించిన దుండగుడు బైక్, తపంచా వదిలి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు డీసీపీ ఉమామహేశ్వర శర్మకు సమాచారం అందించారు. వెంటనే పోలీసు బలగాలతో రాంపల్లి గ్రామానికి చేరుకొని ద గాలించారు. చివరకు కరీంగూడలో దుండగుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.