రంగారెడ్డి

మానవత్వం మరిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, నవంబర్ 18: కంప్యూటర్ యుగంలో కూడా మూఢనమ్మకం మానవత్వాన్ని మంటగలిపేస్తోంది. అనారోగ్యంతో మృతిచెందిన బాలింత మృతదేహాన్ని అమావాస్య కారణంగా ఇంటికి తీసుకు రానివ్వకుండా కాలనీవాసులు అడ్డుపడ్డారు. ఎటూతోచని బాధిత కుటుంబీకులు మృతదేహాన్ని తీసుకొని ఊరు చివర కూర్చుండి పోయారు. ఈ సంఘటన చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. కాలనీవాసులతో చర్చించి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ ఇందిరమ్మ కాలనీలో చోటుచేసుకుంది. రంగారెడ్డిజిల్లా అమన్‌గల్ మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ భార్య గుదేటి మాలతి (30)తో కలిసి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 26 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో మాలతి శిశువుకు జన్మనిచ్చింది. అనారోగ్యంతో మాలతి శుక్రవారం రాత్రి మృతిచెందింది. శనివారం ఉదయం మృతదేహాన్ని బంధువులు ఇంటికి తీసుకరాగా కాలనీవాసులు అమావాస్య కారణంగా కాలనీలోకి తీసుకొస్తే అరిష్టమని అడ్డుచెప్పారు. దీంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్లి తుర్కయంజాల్ మాసబ్‌చెరువులో టెంటువేసుకొని అక్కడే ఉన్నారు. చూసిన వారు హృదయ విదారకరమైన సంఘటనను సోషల్‌మీడియాలో పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కాలనీవాసులతో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

బీసీలకు రాయితీలు కాదు.. రాజ్యాధికారం కావాలి

షాద్‌నగర్ టౌన్, నవంబర్ 18: రాష్ట్రంలో ముఖ్యమంత్రి బీసీలకు రాయితీలను ఎరగా చూపి మభ్య పెడుతున్నారని.. మాకు కావాల్సింది రాయితీలు కాదు రాజ్యాధికారం కావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని బిసి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బిసిలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో ఓటు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. రాజకీయ పార్టీలు బిసిలను రాజకీయంగా ఎదగనివ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 16రోజులుగా కొనసాగాయని, 50శాతం పైగా ఉన్న బిసిల సమస్యల గురించి 16గంటలు కూడా చర్చ జరపకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిసి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1200 మంది అమరులైతే అందులో 1100 మంది బడుగు, బలహీన వర్గాల ప్రజలున్నారని పేర్కొన్నారు. సకల జనుల సమ్మె నిర్వహించినప్పుడు అందులో బీసీల పాత్రనే కీలకమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీసీలు క్రీయశీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. బీసీలు త్యాగాలు చేస్తే అగ్రకులాల వారు భోగాలు అనుభవిస్తున్నారని తెలిపారు. రెండు, మూడు శాతం ఉన్న అగ్రకులాల నాయకులే అధిక శాతం ఉన్న బిసిలపైన ఆధిపత్యం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో షాద్‌నగర్ తాలుకా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాములుగౌడ్, మేడిగ శ్రీను, రాజు, గోపి, అప్పా, నవీన్, శ్రీను, మురళి పాల్గొన్నారు.