రంగారెడ్డి

చోరీలకు పాల్పడుతున్న మహిళల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, నవంబర్ 21: బస్టాప్, రైల్వేస్టేషన్, షాపింగ్ మాల్స్‌ను టార్గెట్ చేసి సెల్‌ఫోన్, బట్టలు, బంగారం, వెండి అభరణాలు దొంగలిస్తున్న ఇద్దరు మహిళలను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళావారం ఫలక్‌నుమా ఏసీపీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఎసీపీ సయ్యద్ ఫయాజ్, ఫలక్‌నుమా ఇన్స్‌పెక్టర్ పులి యాదగిరి, క్రైమ్ ఇన్స్‌పెక్టర్ టీ.మురళీకృష్ణతో కలిసి వెల్లడించారు. మహారాష్టక్రు చెందిన ఫలక్‌నుమా అచ్చిరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న అసీయా పర్వీన్(36), అదే ప్రాంతానికి చెందిన రజీయ పర్వీన్ (32) కలసి అక్రమంగా డబ్బులు సంపాంధించాలనే నేపంతో పిక్‌పాకెటింగ్‌కు పాల్పడుతున్నారు. కొంతకాలం నుండి వీరిద్దరు కలిసి షాపింగ్ మాల్, రైల్వేస్టేషన్, బస్టాప్‌లను టార్గెట్ చేసి పిక్‌పాకెటింగ్‌కు ప్లాపడుతూ సెల్‌ఫోన్, విలువైన వస్త్రాలు, నగలు దొంగలిస్తూ కాలం గడుపుతున్నారు. ఇంజన్‌బౌలిలోని 4జడ్ డిజైనర్ వెడ్డింగ్ మాల్ షాప్ ఉంది. ఈ షాప్‌లో ఈనెల 17న ఖరీదైన జాకెట్‌లు, సారీస్ కనపడుటం లేదనే అనుమానంతో మాల్ యాజమాని షేక్‌అబ్దుల్ మన్నన్ తమ షాపు దొంగతనం జరిగిందని, విలువైన చీరెలు, జాకెట్‌లు కనపడుటం లేదని పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరీశిలించి నిందితులను పట్టుకున్నారు. ఫలక్‌నుమా క్రైమ్ ఇన్స్‌పెక్టర్ టీ.మురళీకృష్ణ, ఎస్‌ఐ ఎల్.రమేష్ నాయక్‌లతో పాటు టీమ్ రంగంలోకి దిగి నిందితులు ఇద్దరిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వారి నుంచి లక్ష 50వేల రూపాయల విలువ చేసే బంగారు, వెండి చైన్, చెవిపోగు, రింగులతో పాటు 29 సెల్‌ఫోన్‌లు, షాపింగ్ మాల్‌లో చోరీ చేసిన చీరెలు, ఇతర వస్త్రాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. జనసంచారం ఎక్కువ తిరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ సూచించారు. సెల్‌ఫోన్లను పోగొట్టుకున్న మల్లేపల్లి విజయ్‌నగర్ కాలనీకి చెందిన టీ.లలిత కుమారి, మరో ప్రాంతానికి చెందిన జగన్‌కు ఫోన్‌ను ఏసీపీ అందజేశారు.

గంగారం చెరువు శిఖం కబ్జా

శేరిలింగంపల్లి, నవంబర్ 21: ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ఉద్యోగే ఏకంగా చెరువు దురాక్రమణకు పాల్పడ్డాడు. చెరువులో మట్టి పోయడం నేరమని తెలిసి కూడా టిప్పర్లతో మట్టి నింపి చదును చేశాడు. అడ్డుకోబోయిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, సిబ్బందిపై తన సహచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే.. శేరిలింగంపల్లి మండలం చందానగర్ గ్రామ పరిధిలోని గంగారం పెద్ద చెరువును ఆనుకుని గతంలో లేఔట్ చేసి ప్లాట్లు విక్రయించారు. చందానగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని పలు సర్వే నెంబర్లలోని భూమిలో కెఎస్‌ఆర్ ఎన్‌క్లేవ్ కాలనీ చెరువు చుట్టూ ప్లాట్లు ఉండడం గమనార్హం. కాగా సర్వే నెంబర్ 277లోని ప్లాట్ నెంబర్లు 343, 344లోని స్థలం పూర్తిగా ఎఫ్‌టిఎల్‌లో ఉన్నప్పటికీ చట్ట విరుద్ధంగా అందులో మట్టి నింపుతున్నారు. రహదారులు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో డీఈఈగా పని చేస్తున్న మహ్మద్ షరీఫ్ ఈ అక్రమాలకు పాల్పడినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. చెరువులో అక్రమంగా మట్టి నింపుతున్న విషయాన్ని తెలుసుకున్న శేరిలింగంపల్లి మండల గిర్దావర్ నిహంత్, సిబ్బంది మంగళవారం వెళ్లి.. పోసిన మట్టిని తొలగించడానికి పూనుకున్నారు. ఎఫ్‌టిఎల్‌లో మట్టి పోసిన ప్రభుత్వ ఉద్యోగి షరీఫ్, కెఎస్‌ఆర్ ఎన్‌క్లేవ్ లేఔట్ చేసి విక్రయించిన సుధీర్ రెడ్డి, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, పలువురు ప్లాట్ల యజమానులు అధికారులతో వాగ్యుద్ధానికి దిగారు. ప్లాట్లు ఉన్నప్పటికీ శిఖం భూమిలో ఉన్న ప్లాట్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలు లేదని గిర్దావర్ నిహంత్, ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు తేల్చి చెప్పారు. కొంత మంది ప్లాట్ల యజమానులు అధికారులను బెదిరించే ప్రయత్నం చేయడంతో కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువు శిఖం భూమిలో ప్లాట్లు చేసి మమ్మల్ని మోసం చేశారని, తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని పలువురు వాపోయారు. చెరువు శిఖంలో ఎవరైనా అక్రమంగా మట్టి నింపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గంగారం పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్‌లో అక్రమంగా మట్టి నింపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు టీఆర్‌ఎస్ శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి చెప్పారు.
పోలీసులకు ఫిర్యాదు
గంగారం పెద్ద చెరువు శిఖంలో అక్రమంగా మట్టి నింపుతున్న ప్రభుత్వ ఉద్యోగి షరీఫ్‌పై ఇరిగేషన్ ఏఈఈ శేషగిరి రావు, గిర్దావర్ నిహంత్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలతో దరఖాస్తు తీసుకుని కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ తిరుపతి రావు చెప్పారు.