రంగారెడ్డి

డంపింగ్ యార్డ్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 21: జనావాసాల మధ్య చెత్త డంపింగ్ యార్డ్, స్మశాన వాటికల స్థలం ఏర్పాటు విషయంలో స్థానికుల నుండి వెల్లువెత్తుతున్న నిరసనను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం బాచుపల్లి గ్రామం హిల్ కౌంటీలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్‌తో కలిసి అల్లం నారాయణ డంపింగ్ యార్డ్, శ్మశానవాటికలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ గ్రామాలకు సంబంధించి చెత్త డంపింగ్ కేంద్రం, స్మశాన వాటికలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం సరికాదని, అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషించి చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో ఈ ప్రాంతంలో 32 ఎకరాల్లో జర్నలిస్ట్ కాలనీ రూపుదిద్దుకోనుందని, ఇలాంటి ప్రాంతంలో చెత్త డంపింగ్ యార్డ్ కేటాయించడం వలన వాయు కాలుష్యంతో భూగర్భ జలాలు సైతం కలుషితమవుతాయని చెప్పారు. వివేక్ మాట్లాడుతూ చెత్త డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలకు ఏర్పాటు చేసిన స్థల విషయంలో స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను విరమించుకునే దిశగా రెవెన్యూ అధికారుల పై ఒత్తిడి తెచ్చి ఇక్కడ చెత్త డంపింగ్ కేంద్రం ఏర్పాటు కాకుండా చూస్తానని అన్నారు. రాంకీ లాంటి సంస్థకు చెత్తను తరలించే ఏర్పాట్లను చేయిస్తానని చెప్పారు. జిల్లా కలెక్టర్‌తో సమావేశమై అధికార యంత్రాంగాన్ని ఒప్పిస్తానని పేర్కొన్నారు. శ్మశానవాటిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. డీపీఓ సురేశ్ మోహన్ మాట్లాడుతూ ప్రజావసరాలకు అనుగుణంగా శ్మశానవాటికల ఏర్పాటు అనివార్యమని, ప్రభుత్వ స్థలాలు నివాస ప్రాంతాలకు దూరంగా లేకపోవడం వలన బాచుపల్లిలోని సర్వే నంబరు 186లోని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల నుండి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ స్థలాలను అనే్వషించాలని బాచుపల్లి సర్వేయర్‌ను ఆదేశించారు. టీయూడబ్ల్యుజే నాయకులు మారుతీసాగర్, బాచుపల్లి సర్పంచ్ ఆగం పాండు, ఎంపీడీఓ అరుణ, ఈవోపీఆర్‌డీ జ్యోతి, ఇవోలు వౌలానా, దుర్గాప్రసాద్, ఆర్‌ఐ శ్రీదేవి పాల్గొన్నారు.

ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టాలి

వికారాబాద్, నవంబర్ 21: జిల్లాలో ఇసుక రవాణ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ దివ్య ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో రేషన్ బియ్యం, ఇసుక అక్రమ తరలింపుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజలకు అందించే రేషన్ సరుకులు అక్రమంగా తరలించకుండా పకడ్బందీగా నిఘాను పెంచాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద వాహనాలను తప్పనిసరిగా తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. అన్ని శాఖలు తమ పరిధిలోని చట్టాలను ఉపయోగించి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడంతో పాటు కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై అవసరమైతే పీడీ చట్టాన్ని ప్రయోగించాలని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియాల పట్ల అవలంభిస్తున్న పద్ధతులను అక్కడకు వెళ్లి తెలుసుకోవాలని తాండూర్ ఆర్డీవో, పరిగి డీఎస్పీ, మైనింగ్ ఏడీలకు సూచించారు. రెవెన్యూ, రవాణా, పౌర సరఫరాలు, మైనింగ్ శాఖకు అవసరమైన చోట్ల సమీకృత చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. పరిగి, దోమ ప్రాంతాల నుండి ఎక్కువగా ఇసుక అక్రమ రవాణ జరుగుతుందని, ఇలాంటి ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను గుర్తించి రాత్రి సమయాల్లో సాయుధ పోలీసులతో గాలింపు చేపట్టి అక్రమ రవాణాను నిరోధించాలని వివరించారు. తదుపరి సమావేశంలో అవసరమైన చెక్‌పోస్టులను గుర్తించి నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ప్రాంతాల్లోని ప్రజలతో సమావేశాలు నిర్వహించి దీన్ని అరికట్టేందుకు కృషి చేయాలని అన్నారు.
ఆర్డీవో, డీఎస్పీలు సమన్వయంతో పనిచేసి అక్రమ రవాణాను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో అటవీశాఖ అధికారి శ్రీలక్ష్మి, డీసీఎస్‌వో పద్మజ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్, గనుల శాఖ ఏడీ సామెల్ జాకబ్, వికారాబాద్, తాండూర్ ఆర్డీవోలు విశ్వనాథం, వేణుమాధవ రావు, వికారాబాద్, తాండూర్ డీఎస్పీలు శిరీష, రామచంద్రుడు, పరిగి సీఐ నాగేశ్వర రావు పాల్గొన్నారు.