రంగారెడ్డి

చెట్టును ఢీకొన్న జీపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, నవంబర్ 21: అదుపుతప్పి ప్యాసింజర్ జీపు చెట్టును ఢీకొనడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ శివారులోని ఏడవ నంబర్ పాత జాతీయ రహదారిపై శంషాబాద్ నుంచి షాద్‌నగర్‌కు వస్తున్న ప్యాసింజర్ జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో చంద్రశేఖర్ రెడ్డి (45), రాధిక (28), మహేందర్ (35), నర్సింలు (40), శ్రీను (26), కుమార్ (24), ఎండీ హుసేన్ (25) ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రశేఖర్ రెడ్డి, రాధిక, శ్రీను అనే ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలించారు. కేశంపేట, ఫరూఖ్‌నగర్, బాలానగర్, నందిగామ, షాద్‌నగర్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. సంఘటన స్థలానికి షాద్‌నగర్ టౌన్ సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐ విజయ్ కుమార్ సిబ్బందితో హుటాహుటిన చేరుకొని ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు రోడ్డుపై నిలవకుండా ట్రాఫిక్ సమస్యను నియంత్రించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక శాసన సభ్యుడు ఎల్గనమోని అంజయ్య యాదవ్ పరామర్శించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు మెరుగైన వైద్యసేవల కోసం త్వరగా హైదరాబాద్‌కు తరలించాలని స్థానిక వైద్య సిబ్బందికి సూచించారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

చేవెళ్ల, నవంబర్ 21: రైతులు అప్పుల ఊబి నుంచి బయట పడాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండ విశే్వశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోని చన్‌వళ్లి గ్రామంలో పాలీహౌస్ నిర్వహణపై రైతులకు అవగాహన సదస్సు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సదస్సుకు ముఖ్యతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ కొండ విశే్వశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్ రామిరెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ పార్థసారథి, జిల్లా అధికారులతో కలిసి అవగాహన సదస్సునుప్రారంభించారు. పాలీహౌస్‌లను తనిఖీ చేసి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రైతాంగ సంక్షేమం కోసం పాటు పడుతున్నారని పేర్కొన్నారు.
పాలీహౌస్‌ల రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తున్నారని చెప్పారు. రైతులు సల్లంగా ఉంటేనే నగరంలో వ్యాపారాలు కొనసాగుతాయని అన్నారు. రైతులకు అధికారులు అందుబాటులో ఉండి భూమి పరీక్షలు చేయించి ఏ పంట వేసుకోవాలో సూచించాలని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 381 మంది పాలీహౌస్ రైతులకు రూ.51 కోట్ల సబ్సిడీ అందించామని చెప్పారు. పాలీహౌస్‌లో రైతులు పండించిన పూలు, కూరగాయాలు ఇతర రాష్టల్రకు ఎగుమతులు చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి పాలీహౌస్ రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు తగ్గించేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎకరాకు రూ.4వేల పెట్టుబడి రెండు పంటలకు అందిచబోతుందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు అవినాష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, జడ్పీటీసీ శైలేజ, ఎంపీపీ బాల్‌రాజ్, చన్‌వళ్లి సర్పంచ్ అనుసూజ, సర్పంచ్ మధుగుప్త, ఎంపీటీసీ నర్సింలు, చేవెళ్ల ఆర్డీవో వేంకటేశ్వర్లు, తహశీల్దార్ గోపీరామ్, ఎంపీడీవో రత్నం, ఏడీఏ దేవకుమార్, నాయకులు యాదగిరి, వసంతం, వెంకటేష్, శర్వలింగం, నర్సింలు, నర్సింగ్ రావు పాల్గొన్నారు.