రంగారెడ్డి

చలితో వణుకుతున్న విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, నవంబర్ 21: చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వసతి గృహం విద్యార్థులు వణుకుతున్నారు. ప్రభుత్వం నుండి దుప్పట్లు సరఫరా కాకపోవడంతో ఇంటి నుండి విద్యార్థులు తెచ్చుకున్న వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో వీస్తున్న చలిగాలులకు రాత్రి సమయాలో వసతి గృహం విద్యార్థులు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు వసతి గృహాల్లో తలుపులు, కిటికీలు సక్రమంగా లేకపోవడంతో చలికి వణుకుతున్నారు. షాద్‌నగర్ పట్టణంలోని బీసీ సంక్షేమ వసతి గృహం, ఎస్టీ వసతి గృహం, బీసీ బాలికల వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహం, ఏ, బీ వసతి గృహాల విద్యార్థులు చలి తీవ్రత తట్టుకోలేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క వసతి గృహంలో 100 నుండి 250 మంది విద్యార్థుల వరకు ఉన్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా నేటి వరకు వసతి గృహాలకు దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు సరఫరా చేయకపోవడంతో ఇంటి నుండి తెచ్చుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తున్నారని, మిగిలిన వాటిపై దృష్టి కేంద్రీకరించడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. చలికాలం దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు దుప్పట్లను సరఫరా చేయాల్సి ఉన్నప్పటికి ప్రభుత్వం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చలి తీవ్రతను తట్టుకోలేక విద్యార్థులు ఇళ్లల్లో నుండి దుప్పట్లను తెచ్చుకొని కాలం వెలదీయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని విద్యార్థులు అంటున్నారు. బీసీ వసతి గృహంలో కిటికీలు, తలుపులు సక్రమంగా లేకపోవడంతో రాత్రి సమయాల్లో వీస్తున్న చలిగాలులకు విద్యార్థులు వణుకుతున్నారు. ఒక్కొక్క దుప్పట్లో ఇద్దరు విద్యార్థుల చొప్పున కప్పుకొని నిద్రిస్తున్నారు. ఎస్టీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడం, వౌలిక సౌకర్యాలు లేకపోవడంతో తంటాలు పడుతున్నారు.
ఎప్పుడు కూలుతుందో తెలియక విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెలదీస్తున్నారు. కిటికీలు, తలుపులు సక్రమంగా లేకపోవడంతో చలిగాలుల నుండి తట్టుకునేందుకు పెట్టెల మధ్యలో విద్యార్థులు నిద్రిస్తున్నారు. ఇదే విషయాన్ని సంబంధిత వసతి గృహాల వార్డెన్ల దృష్టికి తీసుకువెళ్లితే ప్రభుత్వం నుండి సరఫరా లేదు, విద్యార్థులకు ఇవ్వలేకపోతున్నామని అంటున్నారు.

వ్యాపారిపై హత్యాయత్నం

రాజేంద్రనగర్, నవంబర్ 21: ఇటీవల ఓ రియల్ వ్యాపారి పాతకక్షల నేపథ్యంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన ఘటనను మరువక ముందే మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో మరో ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అరాంఘర్ చౌరస్తా ప్రాంతానికి చెందిన ఖాదర్, అలీలు, తలాబ్‌కట్టకు చెందిన హసన్‌బిన్ అబ్దాడ్..రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కాగా ఖాదర్, అలీకు, హసన్‌బిన్ అబ్దాడ్‌కు మధ్య ఇటీవల భూ వివాదంలో తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో అబ్దాడ్ ఖాదర్, అలీపై పగ పెంచుకున్నాడు. మంగళవారం అరాంఘర్ చౌరస్తా సమీపంలోని ఆయిరా గ్రూప్ కార్యాలయంలో ఉన్న ఖాదర్, అలీపై అబ్దాడ్ కత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.