రంగారెడ్డి

అప్పుడు తప్పిపోయి.. ఇప్పడు దొరికింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 21: నాలుగు సంవత్సరాల క్రితం తప్పిపోయిన పెద్దెముల్ మండలం చైతన్యనగర్ చెంచుకాలనీకి చెందిన బాలికను మంగళవారం కలెక్టర్ డీ.దివ్య సమక్షంలో పోలీసు అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పట్లో చైతన్యనగర్‌కు చెందిన చెంచు కుటుంబం కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. స్వగ్రామానికి రైలులో తిరిగి వస్తుండగా బాలిక తప్పిపోయింది. ఇటీవల చైతన్యనగర్‌లో కలెక్టర్ పర్యటించినపుడు తల్లిదండ్రులు బాలిక తప్పిపోయిందని కలెక్టర్‌తో మొరపెట్టుకున్నారు. ఈ విషయమై కలెక్టర్.. బాలిక ఆచూకీ ఆరా తీయాలని ఎస్పీకి సూచించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూరు డీఎస్పీ, సీఐకి బాలిక ఆచూకీ తెలుసుకోవడానికి ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బెంగుళూరులోని చిల్డ్రన్ హోమ్‌లో ఉన్నట్లుగా గుర్తించి బాలికను పెద్దెముల్ సబ్ ఇన్‌స్పెక్టర్ సిబ్బందితో కలిసి తీసుకువచ్చారు. బాలికను తక్కువ సమయంలో తల్లిదండ్రుల చెంతకు చర్చిన తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి, పెద్దెముల్ సబ్ ఇన్‌స్పెక్టర్ వెంకట శ్రీనును అభినందించారు.

గురుకుల ఉపాధ్యాయుల ధర్నా భగ్నం
కుషాయిగూడ, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కోల్పోతున్నామని గురుకుల ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాప్రా సర్కిల్ కార్యాలయ ఆవరణలో టీమాస్ ఆధ్వర్యంలో గురుకుల ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని కోరుతూ చేపట్టిన నిరసన ధర్నా స్ధలంలో కుషాయిగూడ పోలీసులు చెత్త డబ్బాలు పెట్టి తీవ్ర ఆవమాన పరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మహిళా ఉపాధ్యాయులని చూడకుండా పోలీసులు ఇంత ఘోరంగా రాత్రికిరాత్రే టెంట్‌ను తొలగించి ధర్నా స్ధలంలో చెత్త డబ్బాలు పెట్టారని తెలిపారు. ఇందిరాపార్కు దగ్గర 15 రోజులుగా ధర్నా చేసినా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పది జిల్లాల నుండి సుమారుగా 150మంది గురుకుల మహిళా ఉపాధ్యాయులు హాజరై నిరసన తెలిపే హక్కులేదాని కేసీఆర్‌ని ప్రశ్నించారు. గతనెల రోజలుగా ఏన్నో కష్టాలు ఓర్చుకుని మహిళా ఉపాధ్యాయులు శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తుంటే కేసీఆర్ అవమానపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు.
ధర్నా భగ్నం హేమమైన చర్య: సీపీఎం
శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తున్న గురుకుల ఉపాధ్యాయులను పోలీసులు అవమాన పరిచారని సీపీఎం నాయకుడు వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కిల్ కార్యాలయ ఆవరణలో ధర్నా చేయకుండా చెత్త డబ్బాలు పెట్టి మహిళా ఉపాధ్యాయులను కించపరచడం ఎంతవరకు సబబని పేర్కొన్నారు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.