రంగారెడ్డి

మహిళలను వేధిస్తున్న ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, నవంబర్ 23: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ, బడంగ్‌పేట్‌లో నివాసం ఉండే వివాహితను, అవివాహితను వేధిస్తున్న ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వీ.రవీందర్ రెడ్డి, సీఐ ఎన్‌సిహెచ్ రంగస్వామితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 21న జరిగిన రాచకొండ పోలీస్ కమిషనర్ ప్రజా దర్బార్‌లో అల్మాగూడ మధురపూరి కాలనీకి చెందిన వివాహిత(27), బడంగ్‌పేట్‌లో నివసిస్తున్న అవివాహిత తమను ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారని అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు.. మీర్‌పేట్ పోలీసులు కేసులు నమోదు చేసి, మహిళలను వేధిస్తున్న ఎన్.సందీప్ రెడ్డి, గుండెమోని మహేష్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామానికి సందీప్ రెడ్డి(28) మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ ఉద్యోగం మానేసి సొంత ఊరిలో వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహిళ వివాహం 2010లో చేసుకొని తన భర్తతో కలిసి అల్మాస్‌గూడలో నివాసం ఉంటుంది. సందీప్ రెడ్డికి ఫిర్యాదురాలుతో 2003 నుంచి పరిచయం ఉంది. సందీప్ రెడ్డి తనకున్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని, ఫిర్యాదురాలు, ఆమె భర్తకు చెందిన ఫేస్‌బుక్, ఈ-మెయిల్ ఐడిలను తెలుసుకొని వాటి పాస్‌వార్డ్స్ మార్చి, తానే ఉపయోగిస్తూ.. ఫొటోలను, ఆసభ్యకరమైన మెస్‌జ్‌లను ఇతర వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు పోస్టులు చేస్తున్నాడు. దీంతో కుటుంబంలో కలహాలు రావడంతో వివాహిత ప్రజాదర్బార్‌లో సీపీకి ఫిర్యాదు చేసింది. కాగా, వనపర్తి ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన గుండెమొని మహేష్ కొత్తపేట్‌లోని మేనమామ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. తన గ్రామానికి చెందిన, ప్రస్తుతం బడంగ్‌పేట్‌లో ఉండే యువతితో మహేష్‌కు పరిచయం ఉంది. మహేష్ ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడుతూ వేధించడం మొదలు పెట్టాడు. మహేష్ బాధ భరించలేక యువతి ఫోన్ నెంబర్ మార్చిన, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి ఆసభ్యకరంగా మాట్లాడుతూ, మెసేజ్లు పంపడం చేస్తూ.. కుటుంబ సభ్యులను బెదిస్తున్నట్లు షీ టీం ద్వారా సీపీకి ఫిర్యాదు చేసిందని చెప్పారు. సీపీ ఆదేశాల మేరకు వివాహితను, అవివాహితను వేధిస్తున్న సందీప్ రెడ్డి, మహేష్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ, సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు మైబెల్లి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.