రంగారెడ్డి

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, నవంబర్ 23: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శేరి నర్సింగ్‌రావు అన్నారు. గురువారు చేవెళ్ల మండల పరిధిలోని రావులపల్లి శివారులోని హనుమాన్ దేవాలయ తొమ్మిదో వార్షికోత్సవం నిర్వహించారు. హనుమాన్ దేవాలయంలో రాత్రి నుంచి ఉదయం వరకు ఏకధాటిగా భజన కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్థులతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలని సూచించారు. తద్వారా విశ్వమానవ కల్యాణం జరుగుతందన్నారు. సమాజంలో మానవతా విలువలు పెంపొందుతాయన్నారు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలోనే ఎంతో గొప్పవని.. వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో హనుమాన్ దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుందని అన్నారు.

విత్తనరంగ అభివృద్ధిపై సమీక్ష

రాజేంద్రనగర్, నవంబర్ 23: భారత్, జర్మనీ సహకారంతో అమలవుతున్న విత్తనరంగ అభివృద్ధి ప్రాజెక్టుపై గురువారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక రోజు కార్యశాల నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తనాభివృద్ధి శాస్తవ్రేత్తలు, అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంధాలయంలో నిర్వహించిన సమావేశంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్‌రావుతో పాటు జర్మనీకి చెందిన డాక్టర్ ఇకార్డ్, డాక్టర్ ఎర్మాన్ ప్రెడిస్టీన్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్ రావు మాట్లాడుతూ విత్తన నాణ్యత పరీక్ష, సాంకేతికశాస్త్రంలో శిక్షణవంటి అంశాలలో జర్మనీ సహకారం అందించాలని కోరారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, శాస్తవ్రేత్తలు కూడా జర్మనీలో శిక్షణ ఇవ్వడానికి అవకాశం కల్పించాలని కోరారు. జర్మనీలో జరుగుతున్న విత్తన సాంకేతిక పరిజ్ఞానం, రకాల రూపకల్పన, విత్తన ధృవీకరణ, విత్తన నాణ్యత పరీక్ష పాటిస్తున్న అంశాలను డాక్టర్ ఎర్మాన్ ప్రెడిస్టీన్ వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ స్టిఫెన్ ఆఫిక్, డాక్టర్ రాజీవ్ అయ్యార్, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ టీ.ప్రదీప్, డాక్టర్ నాగేష్ కుమార్, వ్యవసాయ శాఖ శాస్తవ్రేత్తలు, ఇండోజర్మన్ ప్రతినిధులు పాల్గొన్నారు.