రంగారెడ్డి

కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 23: నగర శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొనే్నళ్లుగా అయూబ్‌ఖాన్ అనే వ్యక్తి అనుమతులు లేకుండా కాటేదాన్ పారిశ్రామికవాడలో ప్లాస్టిక్ కవర్లతో గిట్టి తయారు చేస్తున్నాడు. గత బుధవారం రాత్రి ప్లాస్టిక్‌కంపెనీలో చిన్నపాటి మంటలు అంటుకున్నాయి. ప్లాస్టిక్ కంపెనీ కావడంతో ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీ మొత్తం అంటుకున్నాయి. వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కావడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిర్వాహాకుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమతులు లేకుండా ఫ్యాక్టరీ నిర్వాహణ
కాటేదాన్ పారిశ్రామికవాడలో అనుమతులు లేకుండా ప్లాస్టిక్ కంపెనీలను నిర్వహిస్తుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల మధ్య కంపెనీలతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అనుమతులు లేకుండా పారిశ్రామికవాడలో నడిచే కంపెనీలు కోకొల్లలు. అలాంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తప్పిన ప్రాణాపాయం
పారిశ్రామికవాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలంటుకోవడంతో ఫ్యాక్టరీ మొత్తం అంటుకుంది. దీంతో స్థానికంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికంగా ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిర్వాహాకునిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

బస్సులు ఆపడం లేదని రాస్తారోకో

శంకర్‌పల్లి, నవంబర్ 23: శంకర్‌పల్లి మండలం బుల్కాపురం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులను ఆపడం లేదని విద్యార్థులు, గ్రామస్థులు గురువారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. శంకర్‌పల్లి - హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమాన్ని 3 గంటలపాటు చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌టీసీ డ్రైవర్లు తమ స్టేజీ వద్ద బస్సులను ఆపడం లేదని మండిపడ్డారు. శంకర్‌పల్లి కంట్రోలర్ గోపాల్‌రెడ్డికి ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఏ విధమైన చర్యలు తీసుకోలేదన్నారు. హైదరాబాద్ నుండి మోకీలా వరకు నడుపుతన్న ఆర్‌టీసీ బస్సులను శంకర్‌పల్లి వరకు నడపాలని కోరారు. శంకర్‌పల్లికి మెట్రో బస్సులను తగ్గించి సబర్బన్ బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. మెట్రో బస్సుల్లో కూడా విద్యార్థులకు పాస్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.
స్థానిక ఎస్‌ఐ క్రాంతికుమార్, కంట్రోలర్ గోపాల్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, ఈ విషయాన్ని అర్‌టీసీ డియం దృష్ట్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించేలే చూస్తామని విద్యార్థులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు హర్షవర్దన్, శివ, తేజ, అనిల్, విష్ణు, విధ్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.