రంగారెడ్డి

మొక్కజొన్న పంట దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, డిసెంబర్ 9: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటన ఆదివారం మండల పరిధిలోని మాచన్‌పల్లి గ్రామ శివారులో చోటుచేసుకొంది. బాధిత కౌలు రైతు వివరాల ప్రకారం.. చర్ల, మల్లేష్, అంజయ్యలు కౌలుకు పొలం తీసుకొని నాలుగు ఎకరాలు మొక్కజొన్న సాగు చేశారు. పంట పూర్తిగా కోతకు వచ్చింది, మరొ రెండు రోజుల్లో కోసేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న అంటుకున్న మరుక్షణమే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు వచ్చేసరికి పంట పూర్తిగా కాలిబూడిదైందని బాధితులు వాపోయారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
క్షతగాత్రులు
సీతాఫల్‌మండి వాసులు
శ్రీశైలంప్రాజెక్టు, డిసెంబర్ 9: నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డులో భక్తులు ప్రమాదానికి గురయ్యారు. శనివారం సాయంత్రం శ్రీశైలం నుండి హైదరాబాద్‌కు వస్తున్న టీఎస్09ఇహెచ్7346 నంబర్ గల కారు, హైదరాబాద్ పికెట్ డిపోకు చెందిన టీఎస్07జెడ్4028 నంబర్ గల ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి సమీపంలోని రాచమళ్లబావి దగ్గర సంఘటన చోటుచేసుంది. అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో వాహనదారులు సమాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక లక్ష్మిరామచంద్రమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో క్షతగాత్రులంతా సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండికి చెందిన వారు. ప్రమాదంలో గాయపడ్డవారిలో కారు డ్రైవర్ నర్సింగరావు, దినేష్, అతిథిదినేష్, లక్ష్మిరామచంద్రమ్మ ఉన్నారు. ఈ మేరకు క్షతగాత్రులను ఈగపెంట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించి అక్కడనుండి హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు ఈగలపెంట ఎస్సై బద్రునాక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం మల్లికార్జునుడి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపారు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం
శంషాబాద్, డిసెంబర్, 9 మతిస్థిమితంలేని విద్యార్థి భవనంపై నుంచి దూకుతానని స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆఫ్ఘానిస్తాన్ దేశం కాబూల్ నగరానికి చెందిన షాకీబ్ వాలీ (25) అనే విద్యార్థి బేగంపెట్‌లో నివాసముంటున్నట్లు తెలిపారు. నిజాం కాలేజీలో బీబీఏ తృతీయ సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. కొన్ని రోజులుగా మతిస్థిమితంలేని ఆ విద్యార్థి శనివారం శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టు బావర్చి హోటల్‌పై నిలబడి దూకుతానని స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతనిని కిందకి దిగమని చెప్పడంతో అతను భవనంపై నుంచి దూకేశాడు. పక్కనే వున్న రేకుల షెడ్డుపై పడడంతో ప్రాణాపాయం తప్పింది. అదుపులోకి తీసుకున్న పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు.