రంగారెడ్డి

సంస్థాగతంగా టీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 10: మేడ్చల్ మండలంలోని గ్రామాలలో టీఆర్‌ఎస్ గ్రామ శాఖల కార్యకర్తల సమావేశాన్ని సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. భాస్కర్ మాట్లాడుతూ పార్టీని సంస్థాగత పరంగా మరింత బలోపేతం చేసేందుకు గ్రామశాఖ కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీరంగవరం, 11 గంటలకు బండమాదారం, మధ్యాహ్నం 12 గంటలకు రాయిలాపూర్, ఒంటి గంటకు గిర్మాపూర్, సాయంత్రం 5 గంటలకు గౌడవెళ్లి గ్రామాలలో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 12వ తేదీన ఉదయం 9 గంటలకు రావల్‌కోల్, 11 గంటలకు సోమారం, 12 గంటలకు ఏల్లంపేట్, 1 గంటకు మేడ్చల్ నగర పంచాయతీ, 3 గంటలకు నూతన్‌కల్, 5 గంటలకు డబిల్‌పూర్‌లో, 14వ తేదీన ఉదయం 9 గంటలకు గుండ్లపోచంపల్లి, 11 గంటలకు కండ్లకోయ, 12 గంటలకు మునీరాబాద్, 1 గంటకు పూడూర్, సాయంత్రం 5 గంటలకు రాజబొల్లారం గ్రామాలలో టీఆర్‌ఎస్ గ్రామ శాఖ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు నందారెడ్డి, నర్సింహా రెడ్డి, వీర్లపల్లి భాగ్య రెడ్డి, సర్పంచ్ రాజమల్లా రెడ్డి, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.

క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
జీడిమెట్ల, డిసెంబర్ 10: క్రైస్తవుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం గండిమైసమ్మ చౌరస్తాలో క్యాథలిక్ రెడ్డీస్ క్రిస్టియన్స్ నిర్వహించిన క్రిస్‌మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంత రావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ క్రైస్తవులకు అల్వాల్‌లో మూడెకరాల స్థలాన్ని కేటాయించి రూ.10 కోట్ల నిధులతో భవనాన్ని సీఎం కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. ప్రతి సంవత్సరం క్రిస్‌మస్ పండుగకు పేద కుటుంబాలకు నూతన వస్త్రాలను ప్రభుత్వం నుండి అందిస్తున్నామని అన్నారు. క్యాథలిక్ రెడ్డీస్ క్రైస్తవులను బీసీ-సీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.