రంగారెడ్డి

ప్రచారంలో శ్రద్ధ.. అభివృద్ధిపై అశ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, డిసెంబర్ 10: అధికార పార్టీ నాయకులు ప్రచార పర్వంలో చూపిస్తున్న శ్రద్ధ అభివృద్ధిపై చూపించడం లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం కొత్తూరులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 40నెలలు గడుస్తున్నా నేటి వరకు ఎక్కడి అభివృద్ధి అక్కడే ఉండిపోయిందని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీఠ వేసింది తెలుగుదేశం పార్టీయేనని గుర్తు చేశారు. గతంలో ఉన్న ప్రాజెక్టులే తప్ప కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా నిర్మించలేదని అన్నారు. రూ.33వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చూడితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం 33వేల కోట్ల నుండి 87వేల కోట్లకు పెంచిందని అన్నారు. రీడిజైన్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి టీడీపీ హయాంలోనే శ్రీకారం చేపడితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న నాలుగు ప్రాజెక్టుల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయని, వెయ్యి కోట్లు మంజూరు చేస్తే 80వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లితే పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులు తామే పూర్తి చేశామని, రైతులకు సాగునీరు, తాగునీరు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసని ప్రశ్నించారు. అర్హులైన దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదని అన్నారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రభుత్వం ఎంతో అర్భాటంగా ప్రచారం చేసి నేడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.కార్యక్రమంలో టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బక్కని నర్సింలు, టీడీపీ నాయకులు నారాయణ రెడ్డి, గణేష్ గౌడ్, కృష్ణయ్య, పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, యాదగిరిచారి, వేణుగోపాల్ చారి, బాల్‌రాజ్, వీరమోని కిష్టయ్య, హాజీ, షాన్‌పాషా పాల్గొన్నారు.