రంగారెడ్డి

డంపింగ్ యార్డ్ తరలించేదాకా పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, డిసెంబర్ 10: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలించేదాకా పోరాటాలు ఆపేదిలేదని విరసం నేత వరవర రావు పేర్కొన్నారు. ఆదివారం కీసరలోని మేడ్చల్ జిల్లా ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో జవహర్‌నగర్ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వరవర రావు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని పోరాటాలు చేస్తుంటే, ఇటీవల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్‌రెడ్డి ప్రజలను మభ్యపెడుతూ ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తూ, ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేసారు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే డంపింగ్ యార్డ్ ఎత్తి వేయటం పెద్ద పనేమీకాదని అన్నారు. పోరాట సమితి ఆధ్వర్యంలో 12న తలపెట్టిన మహాధర్నాకు తామంతా మద్దతు తెలుపుతున్నామని, పోలీసులు, ప్రైవేట్ బలగాలను రాంకీ సంస్థ ముందుగానే ఏర్పాటు చేసుకుందని వివరించారు. ఎంతమంది బలగాలను మోహరించినా, శాంతియుతంగానే ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేయటం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. జవహర్‌నగర్‌లోని పది లక్షల మంది ప్రజలు, ఐదు మండలాల ప్రజలు డంపింగ్‌యార్డుతో బాధపడుతున్నారని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తోందని దుయ్యబట్టారు. మహాధర్నాకు బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు మినహా అన్ని వామపక్ష పార్టీలు మద్ధతు తెలిపాయని చెప్పారు. జూబ్లీహిల్స్, మణికొండ ప్రాంతాల్లో డంపింగ్‌యార్డులు పెట్టేదమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ప్రజాహక్కుల పోరాట కమిటీ చైర్మన్ ఎం.రవి, వివిధ సంఘాల నేతలు రవీంధ్రనాధ్, సహదేవ్, రవిచంద్ర, డానియేల్, లక్ష్మణ్, మస్తాన్‌బీ, జాన్, చంద్రవౌళి, నరేందర్, రాజ్యలక్ష్మీ, శివబాబు పాల్గొన్నారు.