రంగారెడ్డి

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 11: సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం షాద్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాభోది సేవాలాల్ ఆసుపత్రిని ప్రారంభించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ షాద్‌నగర్ పట్టణంలో అంత్యాధునిక టెక్నాలాజీతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సేవా దృక్పథంతో ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే కాకుండా ధరలు కూడా వారికి అనుగుణంగా ఉండే విధంగా చూడాలని సూచించారు. అవసరం లేని సర్జరీలు, టెస్టులు చేయకుండా అవసరం ఉన్న వారికి మాత్రమే చేయాలని సూచించారు. వ్యాధుల పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు జనగామలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎన్‌సీబీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఎల్‌సీడీ కిట్స్‌ను పంపిణీ చేసినట్లు వివరించారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులపై పూర్తి స్థాయిలో అవగాన కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
షాద్‌నగర్‌లో నూతనంగా 50 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లింగారం యాదమ్మ పెంటయ్య, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మహాభోది సేవాలాల్ ఆసుపత్రి చైర్మన్ ఎన్.విజయ్ కుమార్, సీఇఓ డాక్టర్ వి.శివరాం నాయక్, వైద్యులు దిలీప్‌చంద్ర, చైతన్య, చందులాల్ రాథోడ్, విజయలక్ష్మీ, శారద, ప్రేమ్‌కుమార్, కౌన్సిలర్ కృష్ణవేణి, ఎంఎస్ నటరాజ్, వెంకట్ రాంరెడ్డి, రఘునాథ్ యాదవ్, రాజ్యలక్ష్మీ, బీష్వ రామకృష్ణ, శరత్‌కృష్ణ పాల్గొన్నారు.