రంగారెడ్డి

తెలుగు భాషా చైతన్య ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిసెంబర్ 12: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని కొత్తగూడాలోని న్యూబ్లూమ్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు భాషా చైతన్యర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ యూనివర్సిటీ డిప్యూటీ డీన్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరావు ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు మాతృ భాష పట్ల ప్రేమాభిమానాలను, గౌరవాన్ని కలిగి ఉండాలని, జాతీయ సంస్కృతి వారసత్వాన్ని తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు భాషను పరిక్షించుకోవల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత శ్రద్ధతో తెలుగు మహాసభను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో న్యూబ్లూమ్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ యు. కిరణ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడిబోయిన రామస్వామి యాదవ్, ఉపాధ్యయులు, విద్యార్ధులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఇసుక, రేషన్ బియ్యం రవాణాను అరికట్టాలి
వికారాబాద్, డిసెంబర్ 12: ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ.దివ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా తగు చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ రవాణాను అరికట్టేందుకు వీలుగా పరిగి మండలం ఘణాపూర్, కొడంగల్ మండలం రావులపల్లి, యాలాల్ మండలంలోని లక్ష్మీనారాయణపూర్ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్ పోస్టులలో షిఫ్టుల వారీగా తమతమ శాఖల నుండి సిబ్బందిని నియమించాలని తెలిపారు. ఇంకా పటిష్టమైన చర్యల నిమిత్తం అదనంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసేందుకు వీలుగా స్థలాలను గుర్తించామని పేర్కొన్నారు. ఔట్ పోస్టులు ఏర్పాటు కావాల్సిన షెడ్ నిర్మాణాల అంచనాలను సమర్పిస్తే నిధులు కేటాయిస్తామని అన్నారు. ప్రతి చెక్ పోస్టుకు ఒక నోడల్ అధికారిని నియమించనున్నట్లు వివరించారు. సమావేశంలో తాండూర్ ఆర్డీవో వేణుమాధవరావు, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, డీసీఎస్‌వో సీ.పద్మజ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.