రంగారెడ్డి

ఆసుపత్రుల్లో ఖాళీలపై జనవరిలోగా ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 12: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను జనవరిలోగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ డీ.దివ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వికారాబాద్ ఏరియా ఆసుపత్రిలో స్థానిక శాసనసభ్యుడు బీ.సంజీవరావుతో కలిసి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగిందని, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఏరియా ఆసుపత్రి మార్చురీ గది మరమ్మతులు చేసేందుకు అంచనాలు సమర్పిస్తే నిధులను కేటాయిస్తారని పేర్కొన్నారు. మర్పల్లి ఆసుపత్రి మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇక్కడ రెండు రోజుల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురానున్నామని అన్నారు. ఏరియా ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరిగిందని అంబులెన్స్ లేక రోగులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ధారూర్ ఆసుపత్రిలో ఉన్న అంబులెన్స్‌ను వినియోగించుకోవాలని సూచించారు. సిబ్బంది కొరత ఉన్న కారణంగా టీబీ శానిటోరియం నుండి ఇద్దరు వార్డు బాయ్‌లను డిప్యూటేషన్‌పై ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోకు స్పష్టం చేశారు. శాసనసభ్యుడు బీ.సంజీవరావు మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి జిల్లా కలెక్టర్ 25 లక్షల నిధులను కేటాయించారని తెలిపారు. తాను ఒక అంబులెన్స్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి మరో అంబులెన్స్‌ను ఇవ్వనున్నారని అన్నారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ యాదగిరి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం తర్వలోనే పనిచేయడం ప్రారంభిస్తుందని, డాటా ఎంట్రీ ఆపరేటర్ నియామకం చేయాల్సి ఉందని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రంలో రక్తం నిలువకు కేవలం ఒక యంత్రం మాత్రమే పనిచేయడంతో ఎక్కువ నిలువ ఉండటం లేదని అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కొందరిని వేరే ఆసుపత్రులకు పంపాల్సి వస్తోందని వివరించారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ లలిత, ఎంపీపీ ఎస్.్భగ్యలక్ష్మి, జడ్పీటీసీ ముత్తార్‌షరీప్, డీఎంహెచ్‌వో దశరథ్, కమిటి సభ్యుడు నారాయణగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు శేషు, సత్యమ్మలు పాల్గొన్నారు.
సమావేశానికి గైర్హాజరైన మున్సిపల్ చైర్మన్
ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రెండవ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి పట్టణ ప్రథమ పౌరుడైన మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ హాజరు కాలేదు. పేద ప్రజలకు వైద్య సేవలందించే ఆసుపత్రి పరిస్థితులను మెరుగు పర్చేందుకు ఏర్పాటుచేసిన సమావేశానికి చైర్మన్ హాజరు కాకపోవడం గమనార్హం. చైర్మన్ హాజరు కాకపోవడంపై ఆరా తీయగా సమావేశం సమాచారం అందించిన పత్రంలో సమావేశ సమయం లేకపోవడం, ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని కనీసం ఫోన్ ద్వారానైనా తెలియపర్చకపోవడమేనని తెలిసింది.
అయ్యప్ప మహాపడి పూజ
శంకర్‌పల్లి డిసెంబర్ 12: శంకర్‌పల్లి పట్టణ శివారులోని బీడీఎల్ చౌరస్తా సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి స్వామి అధ్వర్యంలో శ్రీ అయ్యప్పస్వామి మహా పడిపూజ ఘనంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం ఎనిమిది గంటలకు స్థానిక హనుమాన్ దేవాలయం నుండి అయ్యప్ప గుడి వరకు అయ్యప్ప చిత్తపటంతో ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప స్వామి శరణు ఘోషతో దేవాలయం మార్మోగింది.