రంగారెడ్డి

ఆన్‌లైన్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 12: రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కమిషనర్ ఆండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్టేషన్ టీకే శ్రీదేవి వివరించారు. మంగళవారం షాద్‌నగర్ పురపాలక సంఘం కార్యాలయంలో సిటిజన్ బడ్డీ యాప్, ఆన్‌లైన్ సేవలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా టీకె శ్రీదేవి మాట్లాడుతూ టెక్నాలజీని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టినట్లు వివరించారు. సిటిజన్ బడ్డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సమస్యలపై కానీ, ఇతర వివరాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. సమస్యలపై దరఖాస్తులు చేస్తే 24 గంటల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకొనున్నట్లు వివరించారు. షాద్‌నగర్ పురపాలక సంఘంను 3వ గ్రేడ్ నుండి 2వ గ్రేడ్‌గా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం ఉన్న జనాభాతోనే కాకుండా శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని అన్నారు. విలీనం చేసిన గ్రామ పంచాయతీలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు, ఈ అవకాశాన్ని శివారు గ్రామ పంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సిటిజన్ బడ్డీ యాప్ ద్వారా ఇంటి వద్ద నుండే బర్త్ సర్ట్ఫికెట్, కుల, ఆదాయ ధ్రువపత్రాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఎక్కువగా ఉండదని, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. తడిపొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని అన్నారు. షాద్‌నగర్ పురపాలక సంఘం కార్యాలయానికి కొత్త భవనం మంజూరు అయిందని, టెండర్ ప్రాసెస్‌లో ఉందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే ఆయా శాఖల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. లైసెన్స్ ఫీజుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టినట్లు వాటికి అనుగుణంగానే చెల్లించాలని సూచించారు. మున్సిపల్‌శాఖకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టడం జరిగిందని, యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పరిశీలించాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిపారు. అధికారులు శాఖల వారిగా పనులు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం, కమిషనర్ శరత్‌చంద్ర, కౌన్సిలర్లు కొంకళ్ళ చెన్నయ్య, ఐటిఐ రాజు, కృష్ణవేణి, మహమూదాబేగం, పాల్మకుల చెన్నయ్య, మహేశ్వరి, భీమమ్మ, నర్సింలుతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.