రంగారెడ్డి

బిస్కెట్ కంపెనీలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, డిసెంబర్ 12: లింగోజిగూడ డివిజన్ బైరామల్‌గూడలోని బిస్కెట్ కంపెనీలో మంగళవారం తెల్లవారుఝామున షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 5.30గంటల ప్రాంతంలో కంపెనీలో నుండి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కంపెనీలో ఉన్న బిస్కెట్లు, మిషన్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. వీటి విలువ సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ఉదయం 10గంటల వరకు ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పారు. మంగళవారం రాత్రి బిస్కెట్లను తయారు చేయకపోవడంతో అందులో ఎవ్వరు లేరని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు
అక్రమంగా తరలిస్తున్న
డీజిల్, వాహనాలు స్వాధీనం
కొందుర్గు, డిసెంబర్ 12: డీజిల్ చోరీ చేస్తున్న వ్యక్తులను పోలీసులు వెంబడించిన సంఘటన చోటుచేసుకుంది. జిల్లేడు చౌదరిగూడ ఎస్‌ఐ లింగం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం అర్థరాత్రి మండల పరిధిలోని లాల్‌పహాడ్ వద్ద నిలిపి ఉన్న దాదాపు 10 లారీల నుండి గుర్తు తెలియని వ్యక్తులు.. డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లే సరికి.. గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ డబ్బాలతో పరారవుతున్న సమయంలో వెంబడించినట్లు వివరించారు. లాల్‌పహాడ్ నుంచి వెంబడించగా ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట శివారులో మారుతి ఓమిని కారును, డీజిల్ డబ్బాలను వదిలిపెట్టి వ్యక్తులు పరారైనట్లు ఎస్‌ఐ లింగం వివరించారు. 518 లీటర్ల డీజిల్, కారుతోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.