రంగారెడ్డి

నడిరోడ్డుపై తిట్టుకున్న కార్పొరేటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, డిసెంబర్ 15: ప్రైవేట్ బేకరి ప్రారంభోత్సవంలో కార్పొరేటర్ల నడి రోడ్డుపై తిట్టుకోవడంతో స్థానిక ప్రజలు ఆవాక్కయారు. కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్‌రావునగర్ డివిజన్ కమలానగర్‌లో ప్రైవేట్ బేకరీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, స్ధానిక కార్పొరేటర్ పావనిరెడ్డి హాజరయ్యారు. ముందుగా వచ్చిన అంజయ్య బేకరీని ప్రారంభించగా ఆలస్యంగా వచ్చిన పావనిరెడ్డి తాను రాకుండా ఎలా ప్రారంభిస్తారని తిట్ల దండకం మొదలుపెట్టారు. కనీసం తోటి కార్పొరేటర్ అని చూడకుండా పోట్లాడుకోవడంతో ప్రజలు ముక్కన వేలుసుకున్నారు. ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లు నడిరోడ్డుపైన తిట్టుకోవడంతో అక్కడే ఉన్న ఎంబీసీ చైర్మన్ తాడురి శ్రీనివాస్ ఇరుపురికీ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా గొడవ మరింతగా ముదిరిపోవడంతో అక్కడి నుండి శ్రీనివాస్ వెళ్లిపోయారు.
అన్ని విధాలుగా అభివృద్ధి
కేపీహెచ్‌బీకాలనీ, డిసెంబర్ 15 : ఆల్వీన్‌కాలనీ డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేలా కృషి చేస్తానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని షంషీగూడ, ఇంద్రహిల్స్, సాయిచరణ్‌కాలనీ, హెచ్ ఎంటీ శాతావాహననగర్, శుభోదయ కాలనీలలో నెలకొన్న ప్రజా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్, అధికారులతో కలిసి ఆయన పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని అన్ని ప్రాంతాలలో వౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలలో వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. కాలువలలో పూడికతీత పనులు పూర్తి చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతుందన్నారు. రోడ్‌లను అక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీ ఈ కృష్ణ, ఎ ఈ సుభాష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహదేవ్, జలమండలి మేనేజర్ వెంకటేశ్వర్లు, నాయకులు నార్నే శ్రీనివాస్‌రావు, కాశీనాథ్‌యాదవ్, బాల్‌రాజు, లక్ష్మీ, కాసాని శంకర్, లద్దె నాగరాజు, పాలమూర్ భాస్కర్, రామకృష్ణగౌడ్, శ్రీను, శివరాజుగౌడ్ లు పాల్గొన్నారు.