రంగారెడ్డి

క్రిస్మస్ ఘనంగా జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 17: క్రిస్మస్ వేడుకలను రాజేంద్రనగర్‌లో ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం బుద్వేల్లోని సలేమ్ ప్రేయర్ చర్చ్‌లో క్రిస్మస్ గిఫ్ట్‌ల పంపిణీలో ప్రకాష్‌గౌడ్ హాజరయ్యారు. క్రిస్టియన్ సోదరులకు ఉచితంగా బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. క్రిస్టియన్ సోదరులు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుందని, బహుమతులను అందుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ విజయలక్ష్మి, స్థానిక టి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ కిట్స్ పంపిణీ
కేపీహెచ్‌బీకాలనీ, డిసెంబర్ 17: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయకాలనీ చర్చిలో తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా అందజేసిన కేసీఆర్ కిట్స్‌ను ఆదివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో పాటు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్‌లు పాల్గొని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేద క్రిస్టియన్లు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేనీ చంద్రకాంత్‌రావు, కాశీనాథ్‌యాదవ్, రామకృష్ణగౌడ్, చిన్నోళ్ల శ్రీనివాస్, శివరాజుగౌడ్, మున్నా, ప్రదీప్‌రెడ్డి, జానయ్య పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం

*సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మోహన్‌బాబు

ఘట్‌కేసర్, డిసెంబర్ 17: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా తమ పాఠశాల నిరంతరం కృషి చేస్తున్నట్లు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సినీ నటుడు మంచు మోహన్‌బాబు తెలిపారు. మండల పరిధి పోచారం పంచాయతీ సంస్కృతి టౌన్‌షిప్‌లోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల వార్షికోత్సవం శనివారం రాత్రి జరిగింది. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా తమ పాఠశాలను తీర్చిదిద్దేందుకు విద్యా ప్రమాణికులను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. దూర ప్రాంత విద్యార్థులకు హస్టల్ వసతిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల యజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థుల ఆసక్తిని తెలుసుకుని వారి అభిప్రాయాలకనుగుణంగా విద్యా బోధన ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అత్యంత ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ డైరక్టర్లు మంచు లక్ష్మి, మంచు విష్ణు, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.