రంగారెడ్డి

డంపింగ్‌యార్డు శాశ్వతంగా ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, డిసెంబర్ 17: జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు శాశ్వతంగా ఎత్తివేసే వరకూ పోరాటాలు ఆపేది లేదని మేడ్చల్ జిల్లా పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొంపల్లి మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చీర్యాల గ్రామంలో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 31 జిల్లాలో లేని సమస్య మేడ్చల్ జిల్లాలో ఉందన్నారు. 20 లక్షల మంది జీవితాలపై దీని ప్రభావం చూపుతోందని తెలిపారు. 15 సంవత్సరాలుగా సమస్య తీవ్రంగా ఉన్నా, ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం దురదృష్టకరమన్నారు. డంపింగ్‌యార్డు వల్ల ఘట్‌కేసర్, కీసర, షామీర్‌పేట్ మండలాల్లోని చెరువులు పూర్తిగా కాలుష్య కాసారంగా మారాయని, ఎదులాబాద్ చెరువు కాలుష్యంగా మారటంతో 400 మంది మత్స్యకారులు ఉపాధికోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. భోపాల్‌గ్యాస్, అనుబాంబు కంటే ప్రమాదకరంగా మారిందని వాపోయారు. దీంతో ప్రజలు అనారోగ్యాల పాలౌతున్నారని అన్నారు. చెరువుల్లో వేసిన చేపలు మృత్యువాత పడుతున్నాయని, జిహెచ్‌ఎంసీ, రాంకీ సంస్థలు అశాస్ర్తియ నిర్వాహణ కారణంగా వాగులు, చెరువులు, కుంటలు కాలుష్య జలాలతో పూర్తిగా కలుషితమై కాలకూట విషంలా మారటంతో పశువులు మరణిస్తున్నాయని అన్నారు. భూగర్భ జలాలు కలుషిత కారణంగా పుట్టబోయే చిన్నారులు అంగ వికలురుగా పుడతారని అన్నారు. బాలాజీనగర్‌లోని ప్రజలు నిర్జీవంగా బతుకుతున్నారని తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశామని, దీనిపై అక్కడే తేల్చుకుంటామని హెచ్చరించారు. జిల్లా పర్యావరణ పరిరక్షణ సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని, డంపింగ్‌యార్డు తరలించేదాకా ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు జీ.తిరుమల్‌రెడ్డి, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, సభ్యులు రామ్మోహన్, రమేశ్, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్, కృష్ణయాదవ్, బోడ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
*గౌతంనగర్ కార్పొరేటర్ శిరిషా జితేందర్‌రెడ్డి
మల్కాజిగిరి, డిసెంబర్ 17: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ ఆర్.శిరీషా జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని గౌతంనగర్ డివిజన్ పరిధిలోగల మల్లికార్జుననగర్, ఇందిరా నెహ్రూనగర్, రామాంజనేయ నగర్, హిల్‌టాప్‌కాలనీ లోని చర్చిల్లో క్రిస్మస్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అందజేసిన బట్టలను ఆదివారం ఆయా చర్చిల్లో ప్రత్యేకంగా జరిగిన కార్యాక్రమాల్లో కార్పొరేటర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో శిరీషా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలందరూ అభివృద్ధి చెంది చిరునవ్వుతో జీవించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసిఆర్ పనిచేస్తున్నారన్నారు. కేసిఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు జితేందర్‌రెడ్డి, సిద్దిరాములు, సతీష్, పరమేష్, రాంచందర్, వీరేశం, రమేష్, అనిల్, నరహరి, ప్రేమ్‌కుమార్, సుమలతాయాదవ్, శంకర్, చర్చి పాస్టర్లు, ఏలియా, రత్నపాల్, డేనియల్, శాంసన్ పాల్గొన్నారు.