రంగారెడ్డి

యువకుడిపై హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, డిసెంబర్ 17: పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ఓ యువకుడిని హత్య చేసేందుకు యత్నించిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అవుషాపూర్ గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అవుషాపూర్ గ్రామంలోని మచ్చ మహేందర్, జయశ్రీ ల కుమారుడు మచ్చ రాజశేఖర్ (24) శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఓ మద్యం దుకాణం వద్ద మిత్రులతో కలిసి చాటింగ్ చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన కంచర్ల తిరుమల్‌రెడ్డి పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణం వద్దకు చేరుకుని రాజశేఖర్‌పై దాడికి దిగినట్లు చెప్పారు. బీరు సీసాతో మెడపై దాడికి దిగటంతో తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని గాంది ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితుని తల్లి జయశ్రీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు.

కల్వకుర్తిని సస్యశ్యామలం చేస్తాం

అమనగల్లు, డిసెంబర్ 17: కల్వకుర్తి పూర్వపు నియెజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి.. సస్యశ్యామలం చేస్తామని నిజమాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అదివారం కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో ఓ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, ఎంపీ కవిత ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కవిత మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. కల్వకుర్తి ప్రజల చిరకాల వాంఛ అయన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీరందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. గత పాలకులు చెప్పిందే తప్ప చేసిందేమీ లేదని అమె ఎద్దేవా చేశారు. త్వరలోనే ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి పూర్వపు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో లక్షా 70 వేల ఎకారాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయడం జరుగుతుందని కవిత స్పష్టం చేశారు. రైతులకు సంక్షేమ అభివృద్ధికి ఎన్నో బృహత్తర పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ప్రధానంగా ఏళ్ళ తరబడి సమస్యల్లో ఉన్న భూములను శుద్ధీకరణ, నవీకరణ చేసి రైతులకు పెట్టుబడి కింద ఎకరాకు నాలుగు నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పేరెన్నిక గల మైసిగండి మైసమ్మ ఎంతో మహిమ గల అమ్మవారన్నారు. కోరిన కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకం ఉన్న దేవి అని అన్నారు. ఈ అలయాన్ని దివంగత మాజీ ఎంపిపి, ఓ గిరిజన నేత పంతునాయక్ ఎంతో అభివృద్ధి చేశారని అమె గుర్తు చేశారు. ఈ అలయ అభివృద్ధికి తన వంతుగా తోడ్పాటునందిస్తానని హమీ నిచ్చారు. హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. వెనుకబడిన కల్వకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి పర్చేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అయన అన్నారు. గత పాలకులే కల్వకుర్తి అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆయన విమర్శించారు. మైసమ్మ అలయాన్ని సందర్శించానని.. కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా మైసమ్మకు పేరుందని అయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సంబుపురం రాజు, మాజీ ఎంపి జగన్నాథం, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టిఅర్‌ఎస్ ఎల్‌బినగర్ ఇన్‌చార్జి ముద్దగోని రాంమోహన్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ విజితరెడ్డి, టిఅర్‌ఎస్ నాయకులుగోళి శ్రీనివాస్‌రెడ్డి, బాలజీసింగ్, శ్రీనివాస్‌రెడ్డి, లాయక్‌అలీ, తుల్సీరాంనాయక్, పాండునాయక్, అలయ ట్రస్టీ శిరోలి, మాజీ మంత్రి రాములు, విరయ్య, సుమన్ , వేణుగోపాల్ ,సర్పంచ్ శేఖర్‌గౌడ్, జహీంగీర్ అలీ, రాజు, తదితరులు పాల్గొన్నారు.