రంగారెడ్డి

తరగతి గది అమ్మ ఒడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, డిసెంబర్ 17: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో శిశు మందిరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ శ్రీ శారదాధామంలో అదివారం ఉదయం పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేడు శిశు మందిరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్ధులపైనే ఉందని పిలుపు నిచ్చారు. దేశంలో శిశు మందిరాల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆదే మాదిరిగానే తెలంగాణాలో ఉన్న 200 శిశు మందిరాలను.. రెండు వేల శిశు మందిరాలను పెంచాలన్నారు. సరస్వతీ శిశు మందిరాలు ఎంతో ఉన్నతమైన విద్యను అందిస్తుందన్నారు. తరగతిగది అమ్మ ఒడి వంటిదని, ఉపాధ్యాయుడు కూడా ఎంతో గొప్పవారని తెలిపారు. ఏదైనా నేర్చుకోవడానికి ఉపాధ్యాయుల సహాయ సహాకారాలు ఎంతో అవసరం అని అన్నారు. గూగుల్ కూడా ఉపాధ్యాయుడు చొవతోనే తయారైందని గుర్తుచేశారు. హిందూ అనేది మతం కాదని, మానవీయ జీవనం అని అన్నారు. సరస్వతీ శిశు మందిరాల్లో చదివిన విద్యార్థులు దేశవ్యాప్తంగా వివిధ ఉన్నత స్థానాలకు ఎదిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, లింగం సుధాకర్‌రెడ్డి, వ్యాపారవేత్తలు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
వీఎన్‌ఆర్ వీజేఐఈటీలో..
జీడిమెట్ల: బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
1999లో తొలిసారి పట్ట్భద్రులైన విద్యార్థులతో సహా సుమారు 200మంది పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. కళాశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సీడీ నాయుడు మాట్లాడుతూ తాను అధ్యాపకునిగా ఈ కళాశాలలో పనిచేస్తుండగా చదువుకున్న వారు తనకింకా గుర్తేనంటూ అందరినీ ఉత్సాహ పరిచారు. నాటి జ్ఞాపకాలను ప్రస్తావించారు. ‘వీజేహబ్’ పేరిట అంకుర సంస్థల కోసం కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు. రెండు సంస్థలు త్వరలో తమ సేవలను, ఉత్పత్తులను విపణిలో ప్రవేశపెట్టనున్నాయని, ఆ రెండు సంస్థలు కూడా విద్యార్థి దశలో ఉండగా తమ పూర్వ విద్యార్థులు నెలకొల్పినవేనని తెలిపారు. సంస్థ రజతోత్సవ సంవత్సరమైన 2020 నాటికి పూర్వ విద్యార్థుల సహకారంతో ‘వీజే హబ్’ కోసం మొదటి విడతగా 10 వేల చదరపు అడుగుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ బృహత్కార్యంలో పాలుపంచుకునే పూర్వవిద్యార్థులు ఆ భవనంలో అంకుర సంస్థలను నెలకొల్పవచ్చని అన్నారు.
త్వరలో పూర్వ విద్యార్థుల సంఖ్య 10 వేలకు చేరుకుంటుందని, పూర్వ విద్యార్థులు స్థానిక కూటములను ఏర్పరచవలసిన అవసరముందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణ నియామకాల విభాగాధిపతి డాక్టర్ పార్థసారథి, పూర్వ విద్యార్థులు సంగమేశ్వర్ రెడ్డి, కళ్యాన్ చక్రవర్తి, రఘురామ్, అశ్విత్‌రెడ్డి, కౌస్త్భు ఎల్లంరాజు, పూర్వ విద్యార్థి విభాగ సమన్వయకర్త డాక్టర్ కాంచన పాల్గొన్నారు.

అర్ధరాత్రి అభివృద్ధి పనుల తనిఖీ
గచ్చిబౌలి, డిసెంబర్ 17: శేరిలింగంపల్లి నియోజక వర్గం కొండాపూర్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అర్థరాత్రి అధికారులు, విలేఖరులను వెంట పెట్టుకుని వెళ్లి తనిఖీలు చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర, రాజరాజేశ్వరి, గోల్డెన్ తులిప్ కాలనీ ఇన్ లెట్ వాటర్ జంక్షన్ పైపులైన్ పనులను పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న పైపులైన్ నుండి 70కె ఎంల సీటిని సరఫరా చేయ వచ్చని పనులు పూర్తి అయితే రాజరాజేశ్వరీ, రాఘవేంద్ర, గోల్డెన్ తులిప్ కాలనీలకు మంచి నీటి సమస్య ఉండదని అభిప్రాయ పడ్డారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు ప్రతి ఇంటికి జనవరి నెలలో సరఫరా చేయనున్నట్లు గాంధీ చెప్పారు. ఈకార్యక్రమంలో వాటర్ వర్క్స్ ప్రొజెక్ట్సు డీజీఎం, వాసు సత్యనారాయణ, వాటర్ వర్క్స్ డీజీఎం శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ ప్రభాకర్, మెగా ఇంజనీరింగ్ ఇన్‌చార్జీ శ్రీనివాస్, తెరాస నాయకులు సాంబశివరావు, బృందరావు, రహమాన్, సుదర్శన్ పాల్గొన్నారు.