రంగారెడ్డి

వాచ్‌మెన్‌పై కత్తులతో యువతుల హత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, డిసెంబర్ 25: అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారిని శబ్దాలు చేయవద్దన్నందుకు వాచ్‌మెన్‌పై కత్తులతో దాడికి పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని సాయిభరద్వాజ్ అపార్ట్‌మెంట్ 302లో రిటైర్డ్ ఎస్‌ఐ కూతుళ్లు శైలజ, సునీత ఉంటున్నారు. కాగా అదే అపార్ట్‌మెంట్‌లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బిసయ్య గత మూడు నెలలుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అపార్ట్‌మెంటువాసులు ఏవో శబ్దాలు వస్తున్నాయి చూడమంటూ వాచ్‌మెన్‌కు ఫోన్ చేశారు. దీంతో బిసయ్య ఫోన్ చేసిన వారితో మాట్లాడుతూ అపార్ట్‌మెంట్‌లో గాలిస్తున్నాడు. ఈక్రమంలో 3వ అంతస్తుకు వెళ్లిన బిసయ్యను శైలజ, సునీతలు అడ్డుకొని ఇక్కడ ఫోన్ మాట్లావద్దని, వెళ్లిపోమన్నారు. అయితే వాచ్‌మెన్ ఏవో శబ్దాలు వస్తున్నాయంటూ టెర్రస్ పైకి వెళ్లాడు. దీంతో వెనుక నుండి శైలజ, సునీతలు వాచ్‌మెన్‌పై కత్తులతో దాడి చేశారు. సీసీ కెమెరాలపై నీళ్లు చల్లుతూ హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు వాచ్‌మెన్‌ను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా ప్రాంతానికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు శైలజ, సునీతలను అదుపులోకి తీసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అక్కాచెల్లెళ్లతో తమకు భయంగా ఉందని, ఇప్పటికే చాలా మంది అపార్ట్‌మెంట్ నుండి ఖాళీ చేసి వెళ్లిపోయారని అపార్ట్‌మెంట్ వాసులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

-- పెద్ద నోట్ల రద్దుతో --

వలస కూలీల బతుకు ఛిద్రం

తాండూరు, డిసెంబర్ 25: దేశంలో ఆర్థిక సంస్కరణలు, అవినీతి రహిత సమాజం, పేదలందరికీ ఆర్థిక వెసులుబాటు కలించే ఉద్దేశంతో దేశప్రధాని నరేంద్ర మోదీ రాత్రికి రాత్రి అకస్మాత్తుగా పెద్ద నోట్లు రూ 1000, 500 రద్దు చేయడం వల్ల ప్రధాని ఆశయం నెరవేరిందో లేదో పూర్తిగా అర్థం కాలేదు కాని సామాన్యుడి బతుకు ఛిద్రం అవుతోంది. నల్లకుబేరుల నల్ల ధనం వెలికితీతకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమకు జరిగే ప్రయోజనం ఏమిటో సగటు సామాన్యుడికి అర్థంకాని ప్రశ్నగానే మిగులుతోంది. టిఆర్‌ఎస్ పాలకుల పుణ్యమా అంటూ, తాండూరు డివిజన్‌తోపాటు, పక్కనే ఉన్న కరవు జిల్లా మహబూబ్ నగర్ నుండి ఏడాది కాలంగా వేలాదిమంది రైతులు వలస కూలీలుగా మారి, మహారాష్టల్రోని ముంబయి, పూణె, భీవాండి, కళ్యాణ్, థానే వంటి ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వలసలు వెళ్ళారు.
గత మూడేళ్ళుగా అనావృష్టి పరిస్థితులు దాపురించగా, గతేడాది నుండి వర్షాలు సమృద్ధిగా కురినినా ఈప్రాంతాల రైతాంగం బతుకులు మెరుగు పడలేదు. అందుకు ప్రధాన కారణం నేటి తెలంగాణ పాలకుల నిర్ణయాలు అని తాండూరు డివిజన్‌లోని రైతాంగంతోపాటు, పక్కనే ఉన్న కరువు జిల్లా పాలమూర్ రైతన్నలు తమ దీనావస్థలను ఏకరువు పెడుతున్నారు. గడచిన మూడేళ్ళుగా రైతాంగానికి పంటరుణాలు గతిలేక, రైతుల పంట రుణమాఫీ పథకం అతీగతీ లేకపోవడం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రోత్సాహం లేనందున తాము బతుకుదెరువు కోసం వలసబాట పట్టారు. రెండు జిల్లాల రైతులు నేడు వలస కూలీలుగా మారారు. కాగా స్వస్థలాల్లో వ్యవసాయం కుంటుపడి పొట్టకూటి కోసం వలసబాట పట్టిన తమపాలిట పెద్ద నోట్ల రద్దు ఆశనిపాతంలా మారిందని ఏకరువు పెట్టారు. ఆదివారం తాండూరు రైల్వే స్టేషన్‌లో ముంబయి తదితర ప్రాంతాల నుండి వచ్చి తమ స్వస్థలాలకు తిరుగు ముఖం పడుతున్న వారి గోడు అరణ్యరోదనగా కన్పిస్తోంది. పెద్దనోట్ల రద్దుతో నల్ల కుబేరులకు వచ్చిన నష్టం ఏమిటో కేంద్రప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన ప్రయోజనం ఏమిటో తమకు మాత్రం అర్థం కావడం లేదని వారు అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తమకు ఉపాధి కల్పించిన యజమానులు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని, తాము చేసే పనికి వారు నగదు ఎలా చెల్లించాలో అర్థం కాని పరిస్థితుల్లో పనులు పూర్తిగా నిలిపివేశారని, ప్రభుత్వం ప్రకటిస్తున్న విధంగా నగదు రహిత సేవలు, ఇతర విధానాలు అక్కడేమీ అమలు కాలేదన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అటు బతకలేక, ఇటు చావ లేక నరకయాతన పడుతూ, తమ ఊళ్ళకు చేరుకుంటున్నట్టు వలసకూలీలు వాపోతున్నారు. అదేమంటే పెద్ద నోట్ల నిర్ణయం వెలువడిన నవంబర్ 8వ తేదీ నుండి తమకు పనులు దొరకలేదన్నారు. బడా బాబులు, బడా కాంట్రాక్టర్లు తమను పనిలో కుదుర్చుకున్న ముఠామేస్ర్తీలు కూలి డబ్బులు చెల్లించకుండా ముఖం చాటేసినట్టు చెప్పారు.
గడచిన 45 రోజులుగా తాము బయటి రాష్ట్రంలో బతుకుదెరువుకోసం పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావన్నారు. ఇక ఆకలి మంటలతో అక్కడ కన్నుమూసే కంటే కల్లో గంజో ఇక్కడే తాగుదామని ఇంటి దారి పడుతున్నామని వారు దీనావస్థను వివరించారు. తెలంగాణ పాలకుల అసమర్థ పాలన, అర్థం పర్థం లేని నిర్ణయాలు తమను మరోసారీ వలస బాట పట్టిస్తే, దేశ ప్రధాని దుందుడుకు నిర్ణయం తమ పొట్టలు కొట్టిందని వలస కూలీలు తమ అవస్థలను చెప్పుకున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏ రోజుకారోజు తమ పరిస్థితులు మెరుగు పడతాయి, తమలాంటి పేదలకు ప్రధాని నిర్ణయం అనుకూలిస్తుందనే ఆశతో నిన్న మొన్నటి వరకు ఓపిక పట్టామని, చివరకు తమ బతుకులు ముంబయి రోడ్లపై అడుక్కుతినే బిచ్చగాళ్ళ కన్నా అధ్వాన్నంగా మారుతోందని భావించి గతిలేక మళ్లీ ఇక్కడకు వచ్చామని చెప్పారు. ఇంటిబాట పట్టిన పటువురు వలస కూలీలు పిల్లా పాపలతో కలిసి వచ్చి తాండూరు రైల్వే స్టేషన్‌లో కంట తడి పెట్టుకోవడం చూపరులను కదిలించింది.