రంగారెడ్డి

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, డిసెంబర్ 27 : భర్త వేధింపులు భరించలేక వివాహిత పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, ఏం జరుగుతుందోనన్న భయంతో భర్త సైతం పురుగుల మందు తాగి ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మండల పరిధిలోని తంగడ్‌పల్లి గ్రామపంచాయతీ అనుబంద గ్రామమైన మడికట్టుకు చెందిన దవారి భూపాల్ (25)కు గండిపేట్ మండల పరిధిలోని మంచిరేవుల గ్రామానికి చెందిన మమత (19)తో నాలుగునెలల క్రితం వివాహం అయింది. వీరి కాపురం కొంతకాలం అన్యోన్యంగా సాగింది. భూపాల్ ఓ ప్రైవేట్ కంపనీలో పనిచేస్తున్నాడు. మడికట్టు గ్రామంలో ఈనెల 23న వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన శుభకార్యం ఉండటంతో అక్కడికి వెళ్దామని భార్య మమతకు చెప్పాడు. అయితే తాను రానని, మా పుట్టించికి వెళ్తానని మమత సమాధానం చెప్పడంతో ఆగ్రహంతోభూపాల్ భార్యపై చేయిచేసుకోవడంతో ఆమె ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. భార్య పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం చూసి భర్త భూపాల్ ఈనెల 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కూడా నగరంలోని ఆస్పత్రికి చికిత్స నిమితం తరలించారు. భూపాల్ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపాని కుటుంబసభ్యులు తెలిపారు. మమత నాలుగు నెలల గర్భవతి కావడంతో మృతురాలి కుటుంబసభ్యులు రోదించారు. భర్త వేధింపులు భరించలేకనే తమకూతురు ఆత్మహత్య చేసుకుందని వారి పైన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్డం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న చేవెళ్ల ఏసిపి శృతకీర్తి, సిఐ గురువయ్య ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న ఇరువురు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వరప్రసాద్ తెలిపారు.
సకాలంలో ఇంటి, నల్లా బిల్లులు వసూలు చేయండి

కొందుర్గు, డిసెంబర్ 27: గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై రంగారెడ్డి జిల్లా డిఆర్‌డిఓ పిడి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చౌదరిగూడ, కొందుర్గు మండలాల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటి పన్నులు, నల్లా బిల్లులు వసూలు చేయడంలో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదిర, వీరన్నపేట గ్రామాలలో పన్నులు ఆశించిన స్థాయిలో రాలేదని, ఇందుకు కార్యదర్శులు జోష్న, రవీందర్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మున్ముందు ఇలాగే ఉంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్చరించారు. పన్నులు సకాలంలో వసూలు చేసి అభివృద్దికి సహకరించాలని అన్నారు. పంచాయతీల్లో చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉన్నతాధికారులతో చర్చించి ప్రతి గ్రామ పంచాయతీకి రిక్షాలు ఇప్పించే విధంగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించిన కూలీలకు సకాలంలో డబ్బులు ఇచ్చే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. పెద్దఎల్కిచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నేటి వరకు బియ్యం సరఫరా కాలేదని చౌదరిగూడ తహశీల్దార్ తేన్మోలి ఇంచార్జి ఎంఇఓ కిష్టారెడ్డిని అడుగగా ఇందుకు ఆయన స్పందిస్తూ స్టాక్ పాయింట్ నుండే తమకు ఆలస్యంగా వచ్చాయని త్వరలోనే పాఠశాలకు సరఫరా చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కొందుర్గు తహశీల్దార్ పాండునాయక్, ఎంపిడివో యాదయ్య, ఇఓ శిల్ప, ఈఓఆర్డి గోపాల్, ఎపిఓ నర్సింగ్‌రావు, ఎఇలు ఈశ్వర్, గోవింద్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.