రంగారెడ్డి

మార్కెట్‌లో ఆక్రమించిన షెడ్ల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 30: మేడ్చల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్ రోడ్డులో వ్యాపారులు ఇష్టారాజ్యంగా అక్రమంగా అక్రమించి ఏర్పాటు చేసుకున్న షెడ్డులను శుక్రవారం నగర పంచాయతీ అధికారులు జెసిబి సహాయంతో తొలగించారు.
వివేకానంద విగ్రహాం నుండి మార్కెట్ రోడ్డులో దుకాణాల ముందు అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను అధికారులు పూర్తిగా తొలగించారు. ప్రధాన మార్కెట్ అనునిత్యం కొనుగోలుదారులతో అత్యంత రద్దీగా ఉంటుంది. వ్యాపారులు అక్రమంగా తమ దుకాణాల ముందు షెడ్లను ఏర్పాటు చేసి కొందరు చిరువ్యాపారులకు రోజు అద్దెకు సైతం ఇచ్చి నిలువుదోపిడీ చేస్తున్నారు. దీంతో చిరువ్యాపారులు రోడ్డు ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ సమస్యను సృష్టించేవారు. దీని కారణంగా నిరంతరం రద్దీగా ఉండే రోడ్డులో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ విషయమై స్పందించిన నగర పంచాయతీ అధికారులు దుకాణాల ముందు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షెడ్లను తొలగించారు.
ముందు జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జెసిబి సహాయంతో షెడ్లలను తొలగించడంతో పాటు మళ్లీ షెడ్లను ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టారు. కాగా గతంలో కూడా అధికారులు షెడ్లను తొలగించిన మళ్లీ కొద్దిరోజుల అనంతరం వ్యాపారులు యధావిధిగా ఏర్పాటు చేసుకున్నారని ఈసారి అలాజరుగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
1నుంచి బోడుప్పల్‌లో ప్లాస్టిక్ కవర్ల సంపూర్ణ నిషేధం

నిబంధనలు ఉల్లంఘిస్తే
కఠిన చర్యలు
కమిషనర్ ఆర్.ఉపేందర్‌రెడ్డి
ఉప్పల్, డిసెంబర్ 30: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్ల వాడకంపై బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలో జనవరి ఒకటో తేదీ నుంచి సంపూర్ణంగా నిషేధిస్తున్నట్లు కమిషనర్ ఆర్.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సివస్తోందని హెచ్చరించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ స్పూర్తితో స్వచ్ఛ తెలంగాణలో భాగంగా పరిశుభ్రతమైన పురపాలక సంఘంగా బోడుప్పల్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పని చేస్తున్న పురపాలక సంఘం పారిశుద్ధ్యం సిబ్బందికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశంలో చెత్తతో పాటు మల, మూత్ర విసర్జనపై నిషేధం ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికే వ్యాపారులకు, ప్రజలకు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తున్న ప్లాస్టిక్ వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని ప్రజలు పాటించాలని తెలిపారు. లేకుంటే చట్టప్రకారం రూ.500 నుంచి 5000 వేల వరకు జరిమానా విధిస్తూ అవసరమైతే కేసులు పెట్టించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు.
వాల్‌పోస్టర్లు సైతం నిషేధం
బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన రహదార్లు, కాలనీ రహదార్లలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై అంటించే వాల్‌పోస్టర్లపై నిషేధం ప్రకటించారు. బ్యానర్లు, కటౌట్లు, ఇతర ప్రచార పోస్టర్లు ఏర్పాటు చేస్తే జరిమానా విధించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ప్రధాన రహదారిలో పోస్టర్లను తొలగించారు.