రంగారెడ్డి

ఇక సత్వరమే కేసుల పరిష్కారం: డిఎస్‌పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, జనవరి 3: గ్రామాల్లో ఆవేశాలకు పోయి తగువులాడుకొని, పోలీస్ స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ ప్రజలు తిరగకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఆయాగ్రామాల్లోనే ఇరు వర్గాలను పిలిపించి సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టినట్లు పరిగి డిఎస్పి అష్పాక్ అన్నారు. మంగళవారం బొంరాస్‌పేట మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి, రేగడి మైలారం, దుద్యాల గ్రామాల్లో గ్రామ పోలీసు అధికారులను నియమించారు. ఈ ఉందర్భంగా డిఎస్పి అష్పాక్ మాట్లడుతూ చిన్న చిన్న సమస్యలకు సైతం పోలీసు స్టేషన్‌ల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్న నిరుపేదలకు గ్రామాల్లోనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆయా గ్రామాల్లోనే గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కూర్చోని అక్కడే వారి సమస్యలు పరిష్కారమయ్యేల చూడటమే విలేజ్ పోలీస్ ఆఫిసర్‌ల విధి అని అన్నారు. అక్కడ పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఉంటే ఆ గ్రామానికి కేటాయించిన విపిఒ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలని అన్నారు.

విజృంభించిన
చైన్ స్నాచర్లు

పట్టుకోవడానికి పోలీసులు పరుగులు
ఉప్పల్, జనవరి 3: ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు విజృంభిస్తున్నారు. గుర్తుపట్టకుండా ముఖానికి ముసుగులు ధరించి బైక్‌పై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. రాత్రింబవళ్లు విధు లు నిర్వహిస్తున్నా వారి కళ్లుగప్పి వేర్వేరు ప్రాంతాలలో మహిళలపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..ఉప్పల్ బ్యాంక్‌కాలనీలో నివసిస్తున్న చాకలి పోచమ్మ తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గులు వేస్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగలు ఆమె మెడలోని బంగారు చైన్‌ను దర్జాగా లాక్కొని పారిపోయారు. ఇదే రోజు సాయంత్రం చిల్కానగర్ గణేష్‌నగర్‌లోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రమణమ్మను వెనుక నుంచి బైక్‌పై వెంబడించిన దుండగులు ఆమె మెడలోని పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. అంతకు ముందు వారం రోజుల క్రితం ఓ ఆగంతకుడు ఇంట్లోకి వెళ్లి గ్యాస్ సిలండర్‌ను ఎత్తుకెళ్లాడు. వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని డిసిపి రమేశ్‌నాయుడు, ఏసిపి సందీప్ సందర్శించారు.