రంగారెడ్డి

సావిత్రిబాయి పూలే అందరికీ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, జనవరి 5: స్ర్తి విద్య, మహిళల అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు ఎనలేనివిని, యువత ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని జెఎన్‌టియుహెచ్ విసి వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే 186వ జయంతిని పురస్కరించుకొని కూకట్‌పల్లి జెఎన్‌టియుహెచ్ విద్యార్థి జెఎసి ఆద్వర్యంలో యూనివర్సిటీ యుజిసి ఆడిటోరియంలో ఉత్సవాలు నిర్వహించారు. జెఎన్‌టియు జెఎసి చైర్మన్ బోయపల్లి అశోక్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జెఎన్‌టియు విసి వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్టార్, రెక్టార్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం గ్రూపు-1 ఆఫీసర్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. అశోక్‌గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయిపూలేను ఆధర్శంగా తీసుకొని మన ముందున్న సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకోవాలని అన్నారు. విద్యార్ధులందరికి ఎలాంటి సమస్యలున్న అన్ని వేళలో అండగా ఉంటామని చెప్పారు. అంతకుముందు పూలే జయంతి సంధర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో అద్యాపకులు వెంకటేశ్వర్‌రావు, ఈశ్వర్‌ప్రసాద్, అజిత్, సత్తిరెడ్డి, రాజేష్‌ఖన్నా, శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది దామోదర్‌రెడ్డి, బాలరాజు, విద్యార్ధి జెఎసి అధ్యక్షుడు అఖిల్, సాయి, ఈశ్వర్, హేమంత్, వినయ్, కృష్ణ, జీవన్, అరవింద్, దేవేందర్, నవ్య పాల్గొన్నారు.

కర్మాగారాల్లో బాలకార్మికులను గుర్తించాలి
కీసర, జనవరి 5: వివిధ కర్మాగారాల్లో పని చేస్తున్న బాలకార్మికులను గుర్తించాలని వివిధ శాఖల అధికారులను మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేపట్టాల్సిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బాలకార్మికులు పని చేస్తున్న ప్రాంతాలను గుర్తించి, వారిని సంక్షేమ హాస్టళ్లలో ఉంచి బడిలో చేర్పించాలని కోరారు. జిల్లాలోని ఏ ప్రాంతాల్లో బాలకార్మికులు కన్పించరాదని అన్నారు. తల్లిదండ్రులున్న బాలకార్మికులను వారికి అప్పగించి పాఠశాలకు పంపేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎక్కడైతే బాలకార్మికులు ఉంటారో అక్కడ పని చేయించుకుంటున్న యజమానిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరంలో ఎంత మంది బాలకార్మికులను గుర్తించారు, ఇప్పటి వరకు ఎంతమందికి గుర్తించారో తెలపాలని అధికారులను కోరారు. ఇతర రాష్ట్ర బాలకార్మికులను గుర్తించి నట్లయితే శని, ఆదివారాల్లో వారి నివాసాలకు చేరేలా చర్యలు తీసుకోవలని తెలిపారు.
అనాథ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో ఉంచాలని అన్నారు. మేడ్చల్ జిల్లాకు బాలకార్మికుల సమాచారం కోసం వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాలకార్మిక నిర్మూలన కోసం గ్రామాల్లో విసృత ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేందర్‌రావు, డిసిపి రమేశ్‌నాయుడు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లారెడ్డి, డిఇఓ సంధ్యారాణి పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
కేశంపేట, జనవరి 5: విద్యతోపాటు క్రీడల్లో రాణించేందుకు విద్యార్థినీ విద్యార్థులు కృషి చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం కేశంపేట మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడుతాయని అన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సమానంగా భావించి ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ఉపాధ్యాయులను నియమించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఉపాధ్యాయులు పాఠశాలల సమయ వేళలు పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను నేర్పించాలని అన్నారు. మాతృభాషను ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు. జనవరి 6వ తేది హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలకు 70మంది విద్యార్థులను ఎంపిక చేశారని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వివరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవించాలని అన్నారు. అలాగే కేశంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ పొందిన గంగాపురం ఇందిరను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపిడివో పద్మజ, ఎంఇఓ మనోహర్, వైస్ ఎంపిపి పల్లాటి సురేందర్, వర్కాల లక్ష్మీనారాయణ, కోఆప్షన్ సభ్యుడు జమాల్‌ఖాన్ పాల్గొన్నారు.