రంగారెడ్డి

సర్కారీ దవాఖానపై నమ్మకం కలిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, జనవరి 6: రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖలందరూ ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయించుకోవాలని పేర్కొంటూ, పేదప్రజలకు దవాఖాన పట్ల నమ్మకం కలిగించేలా జెఎన్‌టియు విద్యార్థులు సర్కారీ దవాఖాన సవాలు అనే పేరుతో వినూత్న ప్రచారం చేపట్టారు. కూకట్‌పల్లి జెఎన్‌టియుకు చెందిన ఎంటెక్ విద్యార్థి తాళ్లపల్లి సురేందర్ ఆధ్వర్యంలో ఉప్పల శశిధర్‌తో పాటు ఎస్.శ్రీనివాస్‌లు ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల మంత్రి కేటిఆర్ పిలుపునిచ్చిన చేనేత వస్త్రాలు ధరించాలనే నినాదం ఆధారంగా ప్రచారాన్ని చేపట్టినట్టు వారు వివరించారు. ఈ సందర్భంగా సురేందర్, శశిధర్, శ్రీనివాస్‌లు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చట్టాలు చేసే ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న దాఖలలు తక్కువని ఇలా ఉంటే రానున్న రోజుల్లో ప్రభుత్వ దవాఖానల మీద పేద ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందని వారు ప్రశ్నించారు. వివిధ రంగాలకు చెందిన సంపన్న వర్గాలు కూడా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం చేయించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పాలకులు ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వసతులు కల్పించి పేద ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దవాఖానల పట్ల పేద ప్రజలకు నమ్మకంతో పాటు మెరుగైన వైద్యం అందించేలా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని, దీని కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
ఆలయంలో చోరీ
స్వామివారి కిరీటం,
వెండి ఆభరణాల అపహరణ
శామీర్‌పేట, జనవరి 6: దేవాలయానికి వేసిన తాళాలను పగులగొట్టి ఆలయంలో ఉన్న వెండి ఆభరణాలను అపహరించిన సంఘటన శామీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని అలియాబాద్ చౌరస్తా వద్దనున్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయానికి గురువారం రాత్రి పూజలు ముగించి తాళంవేసి అర్చకులు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు దేవాలయం తెరిచేందుకు అర్చకుడు సుధాకర్ చారి వచ్చి చూసేసరికి గుడికి వేసిన తళాలు పగులగొట్టి ఉండటంతో దేవాలయం మేనేజర్ రాఘవయ్య, సుధాకర్ చారి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఏసిపి శ్రీనివాస్‌రావు బృందంతోపాటు క్లూస్ టీంతో శామీర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దేవాలయ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీం దేవాలయం లోపల, బయట, చుట్టూ పరిసర ప్రాంతాల్లో వేలిముద్రలు సేకరించారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ దేవాలయంలో ఉన్న స్వామివారికి, అమ్మవారికి ఉన్నవెండి కిరీటం, శఠగోపం, వెండి పళ్లెంతో పాటు స్వామివారికి, అమ్మవారికి మెడలో అలంకరించిన వెండి అభరణాలు దొంగలు అపహరించినట్టు పేర్కొన్నారు. సిసి ఫుటేజ్ రికార్డర్‌ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పారు.సొమ్ము విలువ సుమారు రూ. నాలుగున్నర లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. శామీర్‌పేట పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

పందెం కోళ్ల స్వాధీనం
ఘట్‌కేసర్, జనవరి 6: సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ల పందాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న పందెం కోళ్లు, కత్తులను స్వాధీనం చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఘట్‌కేసర్ పంచాయతీ పరిధి ఇడబ్ల్యుఎస్ కాలనీలో నివాసం ఉంటున్న సత్యనారాయణ రెడ్డి కాలనీ సమీపంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద కోళ్లను పెంచుతున్నాడు. కోళ్లకు బాదం పప్పు, జీడి పప్పులతో పాటు ఇతర బలమైన ఆహార పదార్ధాలు పెడుతుండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పందెపుకోళ్లుగా భావించిన ఎస్‌ఓటి పోలీసులు శుక్రవారం దాడి జరిపి 20 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోళ్లను పెంచుతున్న సత్యనారాయణరెడ్డిని అదుపులోకి తీసుకుని ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు.