రంగారెడ్డి

రైల్వే డబుల్ లైన్ నిర్మాణానికి 15రోజుల్లో టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, జనవరి 8: రైల్వే డబుల్‌లైన్ నిర్మాణానికి 15రోజుల్లో టెండర్లు పూర్తి చేస్తామని మహబూబ్‌నగర్ జిల్లా ఎంపి ఎపి జితేందర్‌రెడ్డి వివరించారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌అండ్ బి అతిది గృహంలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఫలక్‌నుమా నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం వరకు రైల్వే డబుల్‌లైన్ నిర్మాణం పనులు చేపట్టేందుకు 15రోజుల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి కలగానే ఉన్న రైల్వే డబుల్‌లైన్ నిర్మాణం పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే డబుల్‌లైన్ నిర్మాణం పనులు చేస్తున్నట్లు వివరించారు. టి-ఐపాస్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాకు కొత్తగా 765పరిశ్రమలు వచ్చాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లో మొదటి ప్రాధాన్యత కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారానే షాద్‌నగర్ నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరు లభిస్తొందని వివరించారు. ఇప్పటి వరకు 18 టెండర్లు పూర్తి చేయడం జరిగిందని, త్వరలోనే టెండర్లు వేసి నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎవరేన్ని కుట్రలు చేసినా సిఎం కెసిఆర్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు అభివృద్ది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని చటాన్‌పల్లి రైల్వే గేట్టు వద్ద ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 50శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, మరో 50శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. దీంతో బ్రిడ్జి నిర్మించేందుకు అన్ని అడ్డంకులు తొలగుతాయని ఎంపి వివరించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లింగారం యాదమ్మ పెంటయ్య, వైస్ చైర్మన్ జి.వెంకట్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు అందె బాబయ్య, నరేందర్, ఎంఎస్ నటరాజ్, వెంకట్‌రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

కనువిందు చేసిన కూచిపూడి ప్రదర్శన
గచ్చిబౌలి, జనవరి 8: శిల్పారామంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందు చేసింది. ప్రముఖ నృత్య కళాకారుణి డాక్టర్ యశోద ఠాకుర్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. యోగ, ఇండియన్ క్లాసికల్ డాన్స్‌లో పట్టా పోందిన యశోద ప్రముఖ నృత్య కళాకారుణి శోభానాయుడు వద్ద కూచిపూడి నృత్యంపై శిక్షణ తీసుకున్నారు. రెండు దశాబ్దల క్రితం రిందా శరణ్య కూచిపూడి డాన్స్ అకాడిమీని స్థాపించి అనేక మంది నృత్య కళాకారులను తయారు చేశారు. దేశ విదేశాలలో అనేక ప్రదర్శలిచిన యశోద అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్యం కళాకారులను తయారు చేశారు. అన్‌లైన్ ద్వారా విదేశాలలో కూచిపూడి నృత్యంపై శిక్షణ ఇస్తు అనేక మంది నృత్య కళాకారులను తయారు చేసిన పలువురు విదేశీయ ప్రతినిధుల మన్ననలు పొందారు. అమెరికాలోని నార్తకేరునాలో నివాసముంటున కుమారి స్పృహకు శిక్షణ ఇస్తున్నారు. స్పృహ శిల్పారామంలో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. కొలువైతివారంగసాయి, మరకతమణిమయ అంశాలపై చిన్నారి అద్భుతంగా నృత్యం చేసి సందర్శకులను అలరించారు. అనంతరం కమారి సంయుక్త,దేవర్షిని, హర్షిని,వేహిత,మ్రేనిక, అనౌషిక, హరిణి, జయంతిలతో కలసి చేసిన వినాయక కౌతం, దరువు, దశావాతచర శబ్దం, శుద్ధబ్రహ్మ అంశాలను బృందంగా కూచిపూడి శైలిలో నృత్యం చేసి అలరించారు. నృత్యప్రదర్శనకు కోరియోగ్రాఫీ యశోద ఠాకుర్ సమకుర్చుగా నటువాంగం విబిఎస్ మురళి అందించారు. అనంతరం కళాకారులను శిల్పారామం అధికారులు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.

అనాథలకు సేవ చేసే లక్ష్యం గొప్పది
వికారాబాద్, జనవరి 8: అనాథలకు సేవ చేయాలనుకునే లక్ష్యం చాలా గొప్పదని చేవెళ్ళ పార్లమెంటు సభ్యుడు కొండా విశే్వశ్వర్‌రెడ్డి ప్రశంసించారు. ఆదివారం వికారాబాద్ మండలం ధన్నారం గ్రామ శివారులోని యజ్ఞ ఫౌండేషన్ వివేకానంద గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న వివేకానంద నేషనల్ యూత్ సెలబ్రేషన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటుచేసిన బ్లాక్‌తో పాటు వైద్య శిబిరాన్ని, డాక్టర్ కనె్వన్షన్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వ్యవస్థాపకుల కంటే డబ్బులు ఇచ్చి సమయాన్ని కేటాయించే మహాదాతలు అనాథల గురుకుల పాఠశాలలకు ముఖ్యమని చెప్పారు. జీతాలు తీసుకుని పనిచేయని ప్రస్తుత తరుణంలో ఎలాంటి ఆశ లేకుండా పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎన్నో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్‌లు జీతాలు తీసుకుని పనిచేయని తరుణంలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు చెందిన వైద్యులు దేశం, సమాజం, చిన్నారుల కోసం యజ్ఞ ఫౌండేషన్‌ను స్థాపించడం మరువలేనిదని కొనియాడారు. ఎనె్నపల్లిలోని మహావీర్ ఆసుపత్రి వద్ద చిన్నగా ఉండే అనాథ శరణాలయం వివేకానంద గురుకులంగా రూపుదిద్దుకోవడం వెనుక ఎందరిదో కృషి ఉందని తెలిపారు. కార్యక్రమానికి ఉజ్వల్ అధ్యక్షత వహించగా, ధన్నారం సర్పంచ్, ఎంపిటిసి తులసమ్మ, వైద్యుడు రాజశేఖర్, నేషనల్ యూత్ సెలబ్రేషన్స్ కన్వీనర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.