రంగారెడ్డి

ఓయులో విద్యార్థుల అరెస్టు..విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, జనవరి 9: లక్ష ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని కోరుతూ ఓయులో నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో ఛలో ప్రగతి భవనం పిలుపుతో ఉత్కంఠకు తెరతీసింది. ఓయు ఆర్ట్స్ కాలేజీ నుండి నిరుద్యోగ జెఎసి ర్యాలీ బయలుదేరగా భారీగా మోహరించిన స్పెషల్ పోలీసులు అడ్డుకొని విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. నిరుద్యోగ విద్యార్థి జెఎసి నాయకులు మానవతారాయ్, కల్యాణ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే లక్షల ఉద్యోగాలు వస్తాయని గొప్పలు చెప్పిన కెసిఆర్.. ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయకుండా నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ పాలన మాయ పాలనగా ఉందని, మాటలతో గారడీ చేస్తు ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వేదికైన ఓయు నుంచే కెసిఆర్ పాలనకు వ్యతిరేక ఉద్యమం మొదలైందని హెచ్చరించారు. కెసిఆర్ కుటుంబానికే ఉద్యోగాలు లభించాయని ఆందోళన వ్యక్తం చేశారు. జెఎసి నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపడానికి ర్యాలీగా వెళ్తే పోలీసు నిర్భంధం చేస్తు నియంతల వ్యవహారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ర్యాలీలో అంజనేయులు, రమేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.
రూప్‌ఖాన్‌పేటలో పోలీసుల సోదాలు
పరిగి, జనవరి 9: దోమ మండలం ఐనాపురంలో సుజాత్ పాషను దారుణంగా మారుణాయుదాలతో కొట్టి చంపిన దుండగలను తొందరలోనే అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తామని పరిగి డిఎస్పీ అశ్పక్‌అలీ అన్నారు. సోమవారం పరిగి మండల పరిదిలోని రూప్‌ఖాన్‌పేట్‌లో ఇంటింటి సోదాలు కార్యక్రమం నిర్వహించారు. ఐనాపురం గ్రామంలో సుజాత్ పాషను హత్య చేసిన నిందితులు రూప్‌ఖాన్‌పేట్‌లో ఉన్నారని సమచారం ఉండటంతో సోదా చేశామని తెలిపారు. గ్రామంలోని కొంత మందిని తీసుకెళ్లి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు నాయకులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు. సిఐ ప్రసాద్, చన్‌గోమూల్ ఎస్‌ఐ అంజనేయులు, ప్రత్యేక పోలీస్ బలగాలు ఇంటింటి సోద నిర్వహించారు.