రంగారెడ్డి

రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 13: తనను ఎక్కడ హత్య చేస్తాడో అనే భయంతో పథకం వేసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం పేట్‌బషీరాబాద్ పిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎసిపి శ్రీనివాస్ రావు, సిఐ డివి రంగారెడ్డి వివరాలను వెల్లడించారు. చింతల్, బాపూనగర్‌లో నివాసముండే మందడి నాగెందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. పద్మానగర్ ఫేజ్- 2లో నివాసముండే శైలేంద్రకుమార్ అలియాస్ చక్రవర్తి నాగేందర్‌రెడ్డితో కలిసి కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. చక్రవర్తి కదలికలు నచ్చకపోవడంతో నాగెందర్‌రెడ్డి చక్రిని దూరంగా ఉంచాడు. మనసులో పెట్టుకున్న చక్రవర్తి నాగెందర్‌రెడ్డిని హత్య చేయాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో నవంబర్ 16న నాగేందర్‌రెడ్డిపై కాల్పులు జరిపిన కేసులో చక్రవర్తి ప్రధాన నిందితుడు. డిసెంబర్ నెలలో చక్రవర్తిని రిమాండ్‌కు తరలించగా డిసెంబర్ 22న బెయిల్‌పై బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన చక్రవర్తి.. నాగేందర్‌రెడ్డి హతమారుస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని తెలిసింది. ఈ క్రమంలోనే వాజ్‌పేయ్‌నగర్‌లో నివాసముండే కాట నాగయ్య, కుంభ రవితో కొంత డబ్బు మాట్లాడుకుని గురువారం ఉదయం నుంచి చక్రవర్తిని హతమార్చేందుకు మాటు వేశారు. పద్మానగర్ ఫేజ్-2లో రాంబాబు అనే వ్యక్తి ఇంటికి చక్రవర్తి స్థల విషయంపై వెళ్లాడు. మాటు వేసిన నాగేందర్‌రెడ్డి, రవి, నాగయ్య వెంట తెచ్చుకున్న రాడ్డు, ఆయుధాలతో చక్రవర్తిపై దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నాగేందర్‌రెడ్డి, కుంభ రవి, కాట నాగయ్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో నాగేందర్‌రెడ్డి, చక్రవర్తి మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఒకరినొకరు చంపుతారనే భయంతో చక్రవర్తిని మాటు వేసి హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆయుధాలను కేరళ నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసులో
నిందితుల అరెస్టు
పరిగి, జనవరి 13: దోమ మండలం ఐనాపురంలో ఓ వ్యక్తిని దారుణ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డిఎస్పీ అశ్పక్ అలి తెలిపారు. శక్రవారం దోమ పోలీస్ స్టేషన్‌లో ఐనాపురంలో జరిగిన హత్య కేసు వివరాలను వెల్లడించారు. దోమ మండలం ఐనాపురం గ్రామానికి చెందిన సుజాత్ పాష(55) కొడకులు వ్యవసాయ పొలం నుంచి ఇంటికి వస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గుడ్ల రాజు వ్యవసాయ పొలం దగ్గర బోరు దావత్ చేసి వస్తున్నారు. ఒక్కసారిగా పొలం నుంచి వస్తున్న చిన్న దారిలో ఒకరికిఒకరు ఎదురెదురుగా వచ్చారు. పక్కకు జరగాలని అన్నారు. ఎవరూ దరుగా లేదు. ఇద్దరి మధ్యను తోపులాట జరిగింది. గ్రామస్థులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పి పంపించారు. ఇది మనుసులో ఉంచుకుని బుగ్గయ్య, యాదయ్య, రాజ అతని అనుచరులు సాయంత్రం పూట సుజాత్ పాష ఇంటికి వస్తుండగా దాడి చేసి కొట్టారు. తీవ్రగాయాలైన అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బుగ్గయ్య, యాదయ్య, రాజు, అనుచరులు 12 మందిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామని డిఎస్పీ అశ్పక్ అలి తెలిపారు. పరిగి సిఐ ప్రసాద్, దోమ ఎస్‌ఐ ఖలీల్ ఉన్నారు.