రంగారెడ్డి

ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జనవరి 16: తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ బ్యాగులు, క్యారీ బ్యాగులు, నాణ్యతా ప్రమాణాలులేని ప్లాస్టిక్ గ్లాసులు ఇతరాత్ర ప్లాస్టిక్ తయారీ వస్తువులను జనవరి 1వ తారీఖు నుండి మున్సిపల్ పరిధిలో నిషేధించామని మున్సిపల్ కమిషనర్ ఎన్. సంతోష్ కుమార్ వెల్లడించారు. సోమవారం తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో బడా వ్యాపారులు మొదలు చిన్నాచితక వ్యాపారాలు సాగించేవారు, కూరగాయల వ్యాపారులు, బెకరీలు, హోటళ్ల యజమానులు తమ వ్యాపార సంస్థలలో నాణ్యతా ప్రమాణాలు లేని ప్లాస్టిక్ సంచులు, క్యారీ బ్యాగులు వినియోగించడం నేరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నాణ్యతలేని ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించినట్లు వివరించారు. 40 మైక్రాన్స్ కన్నా తక్కువ ప్రమాణాలు కలిగిన అన్ని రకాల ప్లాస్టిక్ వస్తూ సామగ్రిని నిషేధించడానికి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పట్టణంలో పది రోజులుగా ఆటోల్లో మైక్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టామని అన్నారు. నిబంధనలను పాటించకుంటే రూ.500 నుంచి రూ.5000 వరకు జరిమానా విధించడం, జరిమానాలు చెల్లించని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ బ్యాగుల్లో వస్తువులు విక్రయించే వ్యాపారులతో పాటు, వాటిని ఉపయోగించే ప్రజలపై జరిమానా విధించేందుకు అధికార యంత్రాంగం ఆదేశాలు వెలువరించ నున్నట్లు కమిషనర్ హెచ్చరించారు. కాగా స్థానిక వ్యాపారుల డిమాండ్ మేరకు పట్టణంలో తాండూరు పరిసర ప్రాంతాలలో ఉన్న ప్లాస్టిక్ వ్యాపారులు, ఏజెంట్‌లను ప్రస్తుతం తమ వద్ద నున్న ప్లాస్టిక్ బ్యాగులు, కవర్లు నిరోధించేందుకు వారం రోజులు గడువు ఇచ్చినట్లు కమీషనర్ వివరించారు. గతంలో సైతం పలు దఫాలుగా బడా ప్లాస్టిక్ వ్యాపారులు, ఏజెంట్లు, నిల్వదారులకు తమ వద్ద నున్న ప్లాస్టిక్ ను నిరోధించేందుకు అవకాశాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఇక ముందు ఎలాంటి అవకాశం, పరిమిత గడువు ఉండదని వెల్లడించారు.

బ్యాంకు మేనేజర్ పేరుతో మోసం
గచ్చిబౌలి, జనవరి 16: ఎస్‌బిఐ డిబెట్ కార్డు విభాగం నుంచి మేనేజర్‌ని మాట్లాడుతున్నాని చెప్పి శ్రీకాంత్ రాజ్ అనే కారు డ్రైవర్‌కి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నడో వ్యక్తి. నోట్ల రద్దుతో ఎటిఎం, డిబెట్ కార్డులను అప్‌డెట్ చేస్తును.. ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతానెంబర్‌తో పాటు ఎటిఎం కార్డు నెంబరు తెలియ చేయాలని కోరాడు. దాంతో పాటు ఖాతా నెంబర్లు చెప్పిన తరువాత ఒటిపి నెంబరు వస్తుందని, అది కూడ తెలియచేయాలని సదరు వ్యక్తికి సూచించాడు. శ్రీకాంత్ ఆధార్, బ్యాంకు ఖాతా, ఎటిఎం నెంబర్లు అని పూస గుచ్చినట్లు ఫోన్‌లో అవతల వ్యక్తికి చెప్పాడు. కొద్దిసేపటికి శ్రీకాంత్ రాజ్ బ్యాంకు ఖాతా నుంచి 47500 రూపాయలు విత్ డ్రా అయిపోయాయి. అనుమానం వచ్చి వెంటనే వచ్చిన ఫోన్‌కి తిరిగి ఫోన్ చేసి డబ్బులు విత్ డ్రా అయినట్లు చెప్పాడు. సదరు మోసాగాడు డిబెట్ కార్డు అప్‌డెట్ అవుతుంది కొద్ది సేపటిలో తిరిగి మీ డబ్బు మీ ఖాతాలో జమవుతుందని నమ్మించాడు. ఉదయం బ్యాంకు వెళ్లి విచారించగా ఎవరో మోసం చేశారని అధికారులు చెప్పాడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు జనవరి 1న ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులో సూచించిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఝార్కండ్‌కు చెందిన బినోద్ మండల్ అలియాస్ మనోజ్ మండల్ (20)గా గుర్తించారు. నిందితుని కోసం సైబర్ క్రైం ఎస్‌ఐ ఆశీస్‌రెడ్డి బృందం వెస్ట్‌బెంగాల్‌కు చేరుకుని మండల్‌ని పట్టుకునేందుకు పధకం వేశారు.