రంగారెడ్డి

పలువురి ప్రాణాలు కాపాడిన భీమ్‌రావు పేరు..భారత లైఫ్ సేవ్ అవార్డుకు సిఫార్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జనవరి 17: ప్రధానమంత్రి చేతుల మీదుగా భీమ్‌రావుకు భారత లైఫ్ సేవ్ అవార్డు అందేలా కృషి చేస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదంలో ఉస్మాన్ ప్లాజాలో సుమారు 50మందిని కాపాడిన హుమాయూన్‌నగర్ పోలీస్ కానిస్టేబుల్ భీమ్‌రావుకు ఆదే అపార్ట్‌మెంట్‌లోని అసోసియేషన్ సభ్యులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమీషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సోమవారం అగ్ని ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్ వాసులను పోలీస్ కానిస్టేబుల్ భీమ్‌రావు ధైర్య సహాసాలు చేసి కాపాడంతో పోలీస్ శాఖ ఎంతో గర్విస్తుందని అన్నారు. భీమ్‌రావుకు పోలీస్ శాఖ నుంచి పదివేల రూపాయాల నగదు రివార్డును అందజేసినట్లు తెలిపారు. నగరంలో సిసి కెమారాలను ఏర్పాటు చేయడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే భారీగా నేరాలు తగ్గాయన్నారు. నగరాన్ని ప్రపంచంలోనే బెస్టు సీటిగా రూపోందించేందుకు పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వర్‌రావు, ఆసీఫ్‌నగర్ పోలీస్ డివిజన్ ఏసిపి గౌస్ మోహినుద్దిన్, ఇన్‌స్పెక్టర్లు రాజు, వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ అనంద్ పాల్గొన్నారు
ఇంత మందిని కాపాడుతానని అనుకోలేదు: కానిస్టేబుల్ భీమ్‌రావు
అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనలో ముందుగా అందరిని కిందికి దిచ్చేందుకు ప్రయాత్నించానని కానిస్టేబుల్ భీమ్‌రావు పేర్కొన్నారు. ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో అప్పటికే పైఅంతస్తులో చాలా మంది ఉన్నారని, వారిని ఎలాగైనా కాపాడాలని ధైర్యం చేసి పైఅంతస్తుకు వెళ్లి అందరిని కిందికి దించినానని తెలిపాడు. అందరూ కిందికి దిగిన తర్వాత ఓ వృద్ధుడు పైఅంతస్తులోనే ఉండటంతో వెంటనే దట్టమైన పొగలో లోనికి వెళ్లి చీకటుల్లో కేకలు పెడుతున్న అతన్ని పట్టుకుని కిందికి తీసుకవచ్చానని పేర్కొన్నారు. వెంటనే అగ్నిమాపక ఇంజన్ వచ్చి మంటలను అర్పింది.

విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం
వికారాబాద్, జనవరి 17: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ శాసనమండలి సభ్యుడి ఎన్నికల అభ్యర్థి ప్రొఫెసర్ డాక్టర్ విజయ్‌కుమార్ విమర్శించారు. మంగళవారం స్థానిక అర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యాభివృద్దికి సంబంధించి ప్రభుత్వానికి విధివిధానాలు, స్పష్టత లేదని ధ్వజమెత్తారు. రోజుకోమాట, పూటకో పాలసీతో అయోమయానికి గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్ళుగా పెద్దల నోటికి ఏది వస్తే అది చెప్పి పూటగడపడం తంతుగా మారిందని ఆరోపించారు. కెజి నుండి పిజి వరకు గురుకుల పాఠశాలలో ఏర్పాటులో రోజుకో సంఖ్య వినిపిస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను ఏమి చేస్తారని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా డిఎస్‌సి వేయడం లేదని, రెండేళ్ళుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని, ఉపాద్యాయులకు డిఎ ప్రకటించే స్థాయిలో ప్రభుత్వం లేకపోవడం విడ్డూరమని చెప్పారు. జోనల్ విధానంతో వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా బిసిలకు రిజర్వేషన్‌లలో పదోన్నతుల, సిసిఎస్ విధానం రద్దు, క్రమిలేయర్ విధానం బిసిలకు ఎత్తివేయకపోవడం, పిఆర్‌సి బకాయల మంజూరు, ఉద్యోగ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు, ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ విద్యాశిక్షణ కళాశాలలు, సంస్థల్లో అధ్యాపకుల ఖాళీల సమస్యలు ఎక్కడిక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యలన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగ, ఉపాధ్యాయుల సహకారంతో సమస్యల సాధనే ధ్యేయంగా ముందుకెళ్తామని, బడుగు బలహీన వర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరిలో ఉన్న తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో బిసి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణుడు, బిసి సంక్షేమ సంఘం ఉద్యోగుల విభాగం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ధనేశ్వర్, విశ్రాంత ఎంఇవో వీరేందర్‌జీ, టీచర్స్ ఎడ్యుకేటర్స్ అసోసియేషన్ సభ్యుడు ఎంఎ మునాఫ్, బిసి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శివకుమార్, నాయకులు వెంకటేశ్, రాము పాల్గొన్నారు.