రంగారెడ్డి

కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మళ్లీఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 17: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మరో మారు ఉద్రిక్తతకు కేంద్ర బిందువు అయింది. రోహిత్ వేముల మొదటి వర్ధ్ధంతిని యూనివర్సిటీలోని వెలివాడలో ప్రముఖల సమక్షంలో జరపాలని విద్యార్థి జెఏసి నాయకులు ప్రయత్నించగా హైకోర్టు ఆదేశాల పేరుతో యూనివర్సి అధికారులు నిరాకరించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం రాత్రి రోహిత్ వేముల ఆత్మహత్యచేసుకుని ఏడాది అవుతున్న సందర్భంగా విద్యార్ధి ఐకాస ఆధ్వర్యంలో క్యాంపస్‌లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం క్యాంపస్‌లోని వెలివాడలో వర్ధంతి పురస్కరించుకుని సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
విషయం తెలుసుకున్న యూనివర్సిటీ అధికారులు సభను అడుకునేందుకు భారీగా పోలీసులను సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి పంపేది లేదని విశ్వవిద్యాలయం సెక్యూరిటీ ఆఫీసర్ టివి రావు తెలిపారు. కొందరు విద్యార్ధులు గేటుదూకి వచ్చేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి విషమించింది. అదే సమయంలో విద్యార్ధులతోపాటు ప్రజా సంఘల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా రోహిత్ తల్లి రాధిక మాట్లాడుతూ విసి అప్పారావుకేంద్రంలోని బిజెపికి రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వానికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

హరితహారంపై శ్రద్ధ
కీసర, జనవరి 17: జిల్లాలో హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పాల్గొన్నారు. ఎస్‌పి సింగ్ అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ ఎంవి రెడ్డి సమాధానాలు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో నాటిన మొక్కలను సంరక్షిస్తున్నామని, రెండో విడతకు కావల్సిన మొక్కలను నర్సరీలల్లో పెంచుతున్నామని అన్నారు. ఖాళీ స్ధలాల్లో, రోడ్లుకు ఇరువైపులా నాటిన మొక్కలను ప్రజల సహకారంతో సంరక్షిస్తున్నామని చెప్పారు. గ్రామ స్ధాయి నుండి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేశామని పేర్కొన్నారు. వచ్చే నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయని నీరు, నిధులు, సంరక్షణపై ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఎస్‌పి సింగ్ కలెక్టర్‌లను ఆదేశించారు. అన్ని మొక్కలను జియో టాగింగ్ చేయాలని తెలిపారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌లపై ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని కలెక్టర్ ఎంవి రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు కల్యాణలక్ష్మీ కింద 689, షాదీముబారక్ కింద 173 మందికి చెక్కులు అందజేశామని తెలిపారు. మిషన్ భగీరథ పనులు చురుకుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. జనవరి 26 జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఎస్‌పి సింగ్.. కలెక్టలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ హన్మంత్‌రెడ్డి, డిఎఫ్‌ఓ కృష్ణ, డిఆర్‌డిఓ కౌటిల్య పాల్గొన్నారు.